అప్పట్లో అంటే 2014 ఎన్నికల ముందు బాబు మోడీ అభివ్రుధ్ధికి జోడీ అంటూ పసుపు పార్టీ తెగ బిల్డప్ ఇచ్చింది. జనం కూడా నమ్మి ఓట్లు వేశారు. తీరా ఇద్దరు నాయకులు కలుపుగోలుగా ఉన్నసందర్భం ఒక్కటి కూడా లేదు. బాబు తాను మోడీ కంటే సీనియర్ అంటూ దీర్ఘాలు తీసి మోడీ ఇగో బాగా హర్ట్ చేశారు. దాంతో ఆయన చెడ్డారు. ఏపీ కూడా నష్టపోయింది.


ఇపుడు జగన్ కొత్త సీఎం గా వచ్చారు. ఆయన మోడీ ని బాగా స్టడీ చేసి నడచుకుంటున్నారనిపిస్తోంది. పైగా ఆయనకు బాబు నిలువెత్తు ఉదాహరణగా ఉన్నారు. దాంతో మోడీ మెప్పు పొందేందుకు జగన్ తనదైన వ్యవహారశైలిలోనే ప్రయత్నాలు చేస్తున్నారు. మోడీ సైతం జగన్ని బాగానే రిసీవ్ చేసుకుంటున్నారు. తిరుమల వద్ద జగన్ కోసం మోడీ నిమిషం పాటు వేచి ఉండడం అంటే సామాన్యవిషయం కాదు. మోడీ మనసు జగన్ గెలుచుకున్న తీరుకు ఇది అద్దం పడుతోంది.


వయసులో పెద్ద, తండ్రి లాంటి మోడీకి, ప్రధాని హోదాలో ఉన్న వ్యక్తికి జగన్ పాదాభివందనం చేయడం మన సంప్రదాయాన్ని గౌరవించినట్లు తప్ప వేరోకటి కాదు. మోడీ జగన్ ఇప్పటికి రెండు సార్లు కలిసారు. ఈ రెండు సార్లు భుజం తట్టి నేనున్నాను అంటూ మోడీ ఇచ్చిన భరోసా అయిదు కోట్ల ఏపీ ప్రజలకు గొప్ప వూరట. ఈ బంధం ఇలాగే కొనసాగి ఏపీకి  మంచి జరగాలని అంతా కోరుకుంటున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: