ఆర్టీసీని లాభనష్టాల సంస్థగా కాకుండా ప్రజాప్రయోజనాల సంస్థగా పరిగణించాలి.
సంస్థ అప్పుల బాధ్యత ప్రభుత్వమే తీసుకోవాలి. ఆస్తులు మాత్రం సంస్థ ఆధీనంలోనే ఉండాలి. ఆర్టీసీ కార్మికుల సర్వీసు నిబంధనలు ప్రభుత్వోద్యోగులు మాదిరిగానే ఉంచాలి అని కార్మిక సంఘాలంటున్నాయి. ఆర్టీసీ స్థితిగతులివీ..
 1,ఆర్టీసీ ఏటా నష్టాల్లోనే ఉంటోంది.
గత ఆర్థిక సంవత్సరంలో సంస్థకు రూ.వెయ్యి కోట్లకు పైగా నష్టాలు వచ్చాయి. సంస్థకు ప్రస్తుతం రూ.3,380 కోట్ల మేర అప్పులున్నాయి. 
 2, 2015-16లో రూ.49 ఉన్న లీటరు డీజిల్‌ 2018-19 నాటికి రూ.70.41కు చేరింది. ఫలితంగా డీజిల్‌పై ఖర్చు ఏటా పెరుగుతోంది. 
3, కార్మికుల పీఎఫ్‌, ఇతర బకాయిల చెల్లింపులకు సంబంధించి రూ.3,065 కోట్లు ఇవ్వాల్సి ఉంది.
 ఏపీఎస్‌ఆర్టీసీ సమగ్ర సమాచారం 
మొత్తం డిపోలు: 128, బస్సులు: 12,037 (ఆర్టీసీ సొంతానివి 9469, అద్దెవి: 2568), ఉద్యోగుల సంఖ్య 53,261, ప్రతీ రోజు తిరిగే ప్రయాణికుల సంఖ్య: 62 లక్షలు. 


మరింత సమాచారం తెలుసుకోండి: