- వేదపండితునీ ముసుగులో సీఎం కు ఆశీర్వచనాలు చేసిన నరసరావుపేట టిడిపి లీగల్ సెల్ సభ్యులు, గవర్నమెంట్ ప్లీడర్,  (జి. పి) గ బిటి సుధీర్.


నవ్యాంధ్రప్రదేశ్ నూతన ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర సచివాలయం లోని తన చాంబర్లోకి మొదటిసారి అడుగిడుతున్న సందర్భంగా వేద పండితులు ఆశీర్వచనాలతో స్వాగతం పలికారు. అయితే సీఎం గారికి స్వాగతం పలికిన వేదపండితుల లో నరసరావుపేట తెలుగుదేశం పార్టీ లీగల్ సెల్ సభ్యులు. మరియు జిల్లా కోర్టులో జి పి గా పనిచేస్తున్న జి,సుధీర్ వేదపండితులు ముసుగులో పాల్గొనడాన్ని చూసిన గుంటూరు జిల్లాలోని టిడిపి. వైకాపా నాయకులతోపాటు, న్యాయ వాదులు ఆశ్చర్యానికి గురయ్యారు. ఎప్పుడు , ఎక్కడ అర్చకత్వం మరియు
పౌరోహిత్య కార్యక్రమాల్లో కూడా కనిపించని న్యాయవాది సుధీర్ ముఖ్యమంత్రి ఛాంబర్ లో కనిపించటం నరసరావుపేట పట్టణ ప్రజల్లో ఆశ్చర్యాన్ని కలిగించింది.


నూతన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి ప్రతిష్టాత్మకంగా ఆశీర్వచనాలు అందజేస్తున్న వేద పండితుల లో తెలుగుదేశం పార్టీ లీగల్ సభ్యులు. ఆ పార్టీ సిఫార్సులతో జి పి గా బాధ్యతలు నిర్వహిస్తున్న సుధీర్ ఉండటం, ఆయనను ముఖ్యమంత్రి ఛాంబర్ లోకి అనుమతించటం పై సీఎం సెక్యూరిటీ లోని డొల్లతనం అర్థమవుతుంది. వేదపండితుల ముసుగులో ఎవరైనా సంఘ విద్రోహ శక్తులు సీఎం ఛాంబర్ లోకి వెళ్లి ఉంటే పరిస్థితి ఏంటని వైకాపా శ్రేణులు ప్రశ్నిస్తున్నారు. ఇలాంటి పరిస్థితులు మరోసారి ఉత్పన్నం కాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వైకాపా శ్రేణులు, వైఎస్ఆర్ అభిమానులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు,


మరింత సమాచారం తెలుసుకోండి: