నరేంద్ర మోడీకి జగన్ బాగా నచ్చేశాడు. అందుకే ఆయన జగన్ కు భుజం తడుతున్నారు. గో ఏహెడ్ అంటున్నారు. మంచి పాలన అందించమని సూచనలూ ఇస్తున్నారు. మోడీ అజేయుడు. దేశాన్ని రెండవమారు ప్రధానిగా ఏలుతున్న శక్తివంతమైన నాయకుడు. 200లో గుజరాత్ ముఖ్యమంత్రిగా మోడీ బాధ్యతలు చేపట్టారు. ఆయన 2014 వరకూ అంటే 12 ఏళ్ళ పాటు  ఓటమి ఎరగని వీరుడిగా గెలిచారు. ఇప్పటికీ గుజరాత్ లో మోడీ హవా గొప్పగా ఉందనడానికి లోక్ సభ ఫలితాలే నిదర్శనం.


ఇక ప్రధానిగానూ ఆయన రికార్డులు ఎవరూ ఇప్పట్లో బద్దలు కొట్టలేనివే. మూడు దశాబ్దాల తరువాత కేంద్రంలో తొలి మెజారిటీ ప్రభుత్వాన్ని స్థాపించిన ఘనత మోడీదే. ఇక రెండవమారు మరింత ఎక్కువ మెజారిటీ అంటే 303 సీట్లతో గెలిచి మొనగాడు అనిపించుకున్నారు మోడీ. ఇక ఏపీలో మొదటిసారి 151 సీట్లను సాధించిన జగన్ రికార్డుల వీరుడు మోడీకి నచ్చేశారు. 


అందుకే ఆయన్ని తిరుమలో బస చేసిన తన అతిధి గ్రుహానికి ఆహ్వానించి మరీ ఏకంగ చర్చలు జరిపారు. వన్ టు వన్ గా సాగిన ఈ భేటీలో జగన్ ని అన్ని విధాలుగా తాను ఉంటానని, చూసుకుంటానని మోడీ భరోసా ఇచ్చినట్లుగా తెలుస్తోంది. రాజకీయంగా దూకుడుగా ముందుకు సాగిపోవాలని, అలగే  పాలనాపరంగా కూడా ప్రజల మెప్పు పొందాలని మోడీ సూచించినట్లుగా తెలుస్తోంది. మొత్తానికి ఏపీ ప్రజలకు జగన్ నేనున్నాను అంటే కేంద్రంలోకి మోడీ జగన్ కి నేనున్నానని బలమైన హామీ ఇచ్చారని ప్రచారం సాగుతోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: