నారా కుటుంబానికి అతి సన్నిహితుడని చెప్పబడ్డ ఐటీగ్రిడ్ డైరెక్టర్ దాకవరపు అశోక్ కు కొంతలో కొంత ఊరట లభించింది హైకోర్టులో. ఆధార్, డేటా చోరీ కేసుల్లో షరతు లతో కూడిన ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. వీటికి సంబంధించి ఆధార్ సంస్థ ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే.  కానీ అతను దేశం విడిచి వెళ్లొద్దని, పాస్‌ పోర్టు అప్పగించాలని తదితర కండీషన్లు విధించింది హైకోర్టు.  డేటా చోరీ, ఏపీ ప్రజలకు సంబంధించి ఆధార్, డేటా చోరీ చేశాడని ఐటీగ్రిడ్ డైరెక్టర్ అశోక్‌పై ఆధార్ సంస్థ ఫిర్యాదు చేసింది. 
Who Is IT Grids CEO Ashok Dakavaram?
దీంతో అశోక్ చేస్తున్న డేటా చోరీ అంశం సార్వత్రిక ఎన్నికల వేళ సంచలనం సృష్టించింది. ఆధార్ సంస్థ డిప్యూటీ డైరెక్టర్ ఫిర్యాదు చేయడంతో మాదాపూర్ పోలీసులు కేసు నమోదు చేశారు. సెక్షన్ 37, 38-ఏ, 38-బీ, 38-జీ, 40, 42, 44-ఏఏల కింద ఐటీగ్రిడ్స్ సంస్థపై కేసులు పెట్టారు. డైరెక్టర్ అశోక్ కోసం దర్యాప్తు బృందాలు గాలించాయి. ఆ సమయంలో ముందస్తు బెయిల్ కోసం కూడా అశోక్ హైకోర్టును ఆశ్రయించినా ఫలితం లేకుండా పోయింది. బెయిల్ ఇచ్చేందు కు కోర్టు నిరాకరించడంతో ఆయన అజ్ఞాతంలోనే ఉండిపోయారు. ఎన్నికలు ముగిసి, రాష్ట్రంలో తెలుగుదేశం పాలనకు చరమ గీతం పాడెయ్యటం, నూతన ప్రభుత్వం అధికార పగ్గాలు చేపట్తిన దరిమిలా - కేసు విచారణ మళ్లీ పుంజుకోనున్న సమయంలో హైకోర్టును ఆశ్రయించారు అశోక్. 
Image result for ఐటీ-గ్రిడ్ అశోక్‌
ముందస్తు బెయిల్, ఆధార్, డేటా చోరీ అంశంపై నమోదైన కేసుల నుంచి ముందస్తు బెయిల్ ఇవ్వాలని కోర్టును ఆశ్రయించారు అశోక్. పిటిషినర్ తరఫు వాదనుల విన్న హైకోర్టు బెయిల్ ఇచ్చేందుకు అంగీకరించింది. కానీ కొన్ని కఠినమైన షరతులు విధించింది. అకోశ్ విదేశాలకు వెళ్లకూడదని స్పష్టం చేసింది. పాస్‌పోస్టును కోర్టును అప్ప గించాలని షరతు విధించింది. అలాగే కేసు విచారణకు సంబంధించి ప్రతి రోజు విధిగా పోలీసు స్టేషన్‌కు హాజరు కావాలని కండీషన్ పెట్టింది. తాము పెట్టిన షరతులకు అంగీకరిస్తే ముందస్తు బెయిల్ ఇస్తామని స్పష్టంచేసింది. ఇందుకు అశోక్ తరఫు న్యాయవాది అంగీకరించినట్టు తెలిసింది.


అత్యంత కీలకమైన ఓటర్, ఆధార్, వ్యక్తిగత సమాచారాన్ని చోరీచేశారని ఐటీగ్రిడ్స్‌పై డేటా విశ్లేషకులు టి.లోకేశ్వర్‌రెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు అశోక్‌పై సంజీవరెడ్డినగర్, మాదాపూర్‌ పోలీస్‌స్టేషన్లలో కేసులు నమోదైన విషయం తెలిసిందే.

Image result for ఐటీ-గ్రిడ్ అశోక్‌

మరింత సమాచారం తెలుసుకోండి: