ప్రతి రోజు దేశంలో ప్రతి బాలికల దగ్గర నుంచి మహిళల వరకు అత్యాచారాలకు బలైపోతున్నారు. వీటిలో 90 శాతం బాధితులు క్రూరంగా  హత్యగావించబడు తున్నారు. స్త్రీలను గౌరవించే సాంప్రదాయం గల దేశంలో ఇప్పుడు వారికి రక్షణ లేకుండా పోయింది. అయితే అత్యాచారాలకు పాల్పడుతున్న కిరాతకులకు కఠిన శిక్షలు విధించడంలో మాత్రం పోలీసులు, న్యాయస్థానాలు విఫలమవుతున్నాయి. ఇదిలా ఉంటే ఒకవైపు దేశవ్యాప్తంగా పసిమొగ్గలు, మైనర్‌ బాలికలపై పాశవికమైన అత్యాచారం, హత్యలు తీవ్ర ఆందోళన రేపుతోంటే.. బాధ్యతాయుతమైన తా   మంత్రి స్థానంలో ఉన్న తివారి వ్యాఖ్యలు మరింత ఆగ్రహాన్ని రగిలిస్తున్నాయి. 


యూపీ  అలీగఢ్‌లో రెండున్నరేళ్ల పాప దారుణ హత్యపై స్పందించిన ఉపేంద్ర తివారీ   అత్యాచారాలపై మాట్లాడుతూ..వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. అసలు మైనర్‌ బాలికలపై జరిగిన అత్యాచారాలు మాత్రమే నిజమైన రేప్‌లుగా పరిగణించాలని తివారి వ్యాఖ్యానించారు. కానీ కొన్నిసార్లు 30-35 వివాహిత మహిళలు కూడా  రేప్‌ ఆరోపణలతో ముందుకు వస్తున్నారని ఉపేంద్ర తివారీ ఆరోపించాడు.. అంతే కాదు సదరు మహిళలు 7 - 8 సంవత్సరాలుగా నిందితుడితో వివాహేతర సంబంధం కొనసాగిస్తూ వుండి ఉంటారని, అలాంటి మహిళలు చేస్తున్న  అత్యాచార ఆరోపణలను పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరం లేదని తివారీ దిగజారుడు వ్యాఖ్యలు చేశాడు.  


యుపీ మంత్రి ఉపేంద్ర తివారీ అత్యాచారాల గురవుతున్న మహిళల గురించి చేసిన వ్యాఖ్యలపై నెట్‌జన్లు మండిపడుతున్నారు. అత్యాచారాలకు గురవుతున్న మహిళల శీలాన్ని శంకించేలా ఉపేంద్ర తివారీ వ్యాఖ్యలు ఉన్నాయని, వెంటనే మంత్రి మహిళలకు క్షమాపణ చెప్పాలని  నెట్‌జన్లు డిమాండ్ చేస్తున్నారు. మహిళలు, ఆత్మగౌరవం అంటూ మాట్లాడే బీజేపీ నేతలు మహిళల శీలం గురించి ఇలాగే మాట్లాడుతారా అంటూ యుపీలో నిరసన వ్యక్తం అవుతోంది. మొత్తంగా అత్యాచారాల విషయంలో యుపీ మంత్రి ఉపేంద్ర తివారీ మహిళలను అవమానించేలా చేసిన వ్యాఖ్యలపై తీవ్ర దుమారం చెలరేగుతుంది. యుపీ మంత్రి ఆదిత్యానాథ్ తివారి సదరు మంత్రిపై ఎలాంటి చర్యలు తీసుకుంటారో లేదో చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: