ముఖ్యమంత్రి యువనేస్తం నిరుద్యోగ భృతి పథకం గురించి గందరగోళం ఇంకా తీరలేదు. పథకం అమలుపై ఎటువంటి స్పష్టతా రాలేదు. కేబినేట్ మీటింగ్లో పథకం గురించి ఎలాంటి నిర్ణయం వెలువడలేదు.పథకం అమలుపై సందేహాలు ఇంకా వీడలేదు.

 

పది రోజులైనా పథకం గురించి ఎలాంటి సమాచారం లేకపోవటం పట్ల నిరుద్యోగులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. పథకం గురించి ఇస్తారో లేదో ఏదో ఒక విషయం తెలిస్తే బాగుంటుందని అభిప్రాయపడుతున్నారు. పథకం గురించి ఎవరి దగ్గరా ఎటువంటి స్పష్టమైన సమాచారం లేకపోవటం పథకం లబ్దిదారులను నిరాశకు గురి చేస్తుంది.

 

నిరుద్యోగ యువత కనీస ఖర్చులకు పథకం చాలా ఉపయోగపడింది.సుమారు ఐదు లక్షల మంది యువత పథకంతో లభ్ది పొందారు. యువత ఏదో ఒక ఉద్యోగం పొందే దాకా పథకాన్ని కొనసాగించి ఉంటే బాగుంటుందని అభిప్రాయపడుతున్నారు


మరింత సమాచారం తెలుసుకోండి: