చంద్రబాబును అందరూ ముద్దుగా యూ టర్న్ బాబు అని పిలుస్తారు. దేశంలో ఏ రాజకీయ పార్టీతోనైనా కలుస్తారు. సిద్ధాంతాలు, రాజకీయ విలువలు ఇవన్నీ బాబుగారికి అక్కర్లేదు. కాంగ్రెస్ తో కలిసినప్పుడే బాబుగారి రాజకీయ నీతి ఏంటో అందరికీ అర్ధం అయ్యింది. అయితే కాంగ్రెస్‌తో విభేదించిన రోజుల్లోనూ ఆ పార్టీ ప్రభుత్వంలో వుంటే, ప్రభుత్వ పెద్దలతో సన్నిహిత సంబంధాలు నడిపారు. ఆనాటి ఆ చీకటి 'కలయిక' గురించి అప్పటి కేంద్ర మంత్రి చిదంబరం పార్లమెంటు సాక్షిగా వెల్లడిస్తే, మొత్తంగా దేశం విస్తుపోయింది. వ్యవస్థల్ని మేనేజ్‌ చేయడంలో చంద్రబాబు తర్వాతే ఎవరైనా. అలాంటి చంద్రబాబు, ఇప్పుడు మళ్ళీ లాబీయింగ్‌ చేయకుండా వుంటారా.?


అయినా, చంద్రబాబు లాబీయింగ్‌ ఆపేశారని అంటే కదా, మళ్ళీ మొదలెట్టారని అనుకోవడానికి.! రాజకీయ వైరం వేరు, లాబీయింగ్‌ వేరు చంద్రబాబు దృష్టిలో. ముందు కత్తులు దూస్తారు, వెనకాల కౌగలించుకుంటారు. ఇదీ చంద్రబాబు వ్యవహారం. ఇంకా కాంగ్రెస్‌ పార్టీతో చంద్రబాబు సన్నిహిత సంబంధాలు కొనసాగుతున్నాయి. మరోపక్క, బీజేపీ పెద్దలతోనూ ఆయన టచ్‌లోనే వున్నారు. 'చంద్రబాబు ఎప్పటికీ మా మిత్రుడే' అని బీజేపీతో తెగతెంపులు చేసుకున్నాక కూడా, హోంమంత్రిగా పనిచేసిన రాజ్‌నాథ్‌సింగ్‌, పార్లమెంటులోనే వెల్లడించిన విషయం విదితమే. 


ఇటీవల చంద్రబాబు, గవర్నర్‌తో భేటీ అయ్యారు. ఆ భేటీ వెనుక పరమార్ధం ఏంటన్నదానిపై చాలా చర్చ జరుగుతోంది. సరిగ్గా ఈ టైమ్‌లోనే, చంద్రబాబు డైరెక్ట్‌గా కేంద్ర హోంమంత్రి అమిత్‌ షాతోనే డైరెక్ట్‌గా టచ్‌లో వున్నారన్న గాసిప్‌ తెరపైకొచ్చింది. వినడానికైతే కాస్తంత షాకింగ్‌గానే వున్నా, చంద్రబాబుకి ఇలాంటివన్నీ మామూలే. అయితే, ఓసారి టీడీపీ దెబ్బ రుచి చూసిన బీజేపీ, ఇంకోసారి చంద్రబాబుని తమ పంచన చేరనిస్తుందా.? అన్నది మాత్రం మిలియన్‌ డాలర్ల ప్రశ్న. 

మరింత సమాచారం తెలుసుకోండి: