2014 లో పవన్ కళ్యాణ్ జనసేన పార్టీని స్థాపించిన తరువాత తెలుగుదేశం, బీజేపీకి సపోర్ట్ చేశారు.  ఆ సమయంలో గోదావరి జిల్లాలో పవన్ చాలాసార్లు ప్రచారం చేశారు.  పవన్ ప్రచారం వలన రావెల కిషోర్ బాబు విజయం సాధించారు.  తరువాత ఆయన టిడిపిలో మంత్రిగా పనిచేశారు.  


2018 లో తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ నుంచి బయటకు వచ్చిన తరువాత రావెల కిషోర్ బాబు మంత్రి పదవి నుంచి బయటకు రావాల్సి వచ్చింది. 2019 ఎన్నికలకు ముందు కిషోర్ జనసేన పార్టీలో జాయిన్ అయ్యాడు.  ఎన్నికల్లో రావెల ఓటమి పాలయ్యాడు. 


ఇది జరిగిన కొన్ని రోజులకే రావెల కిషోర్ తిరిగి బీజేపీలో జాయిన్ అయ్యాడు.  బీజేపీలో జాయినైనా వెంటనే పవన్ పై విమర్శనాస్త్రాలు చేయడం మొదలు పెట్టాడు.  జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తనకు పార్టీలో సరైన స్థానం ఇవ్వలేదని రావెల ఆరోపించారు. జనసేన కీలక నేతలతో తాను ఒకడినని జరిగిన ప్రచారంలో వాస్తవం లేదన్నారు. 


పవన్ కళ్యాణ్ ఎప్పుడూ తనకు అంత ప్రయారిటీ ఇవ్వలేదన్నారు రావెల కిషోర్ బాబు. అంతేకాదు కనీసం పవన్ కళ్యాణ్ తన అపాయింట్మెంట్ కూడా ఇవ్వకుండా ఇబ్బంది పెట్టే వాడన్నారు రావెల. తన సలహాలు సూచనలు ఎప్పుడు పవన్ తీసుకోలేదని ఆయన పేర్కొన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: