2019 ఎన్నికలు చంద్రబాబును నిద్రపోనివ్వకుండా చేశాయి.  కనీసం ఎన్నికల్లో కొంత వరకైనా సక్సెస్ సాధిస్తామని అనుకున్నారు.  కానీ, ఈ స్థాయిలో టీడీపీపై ప్రజలకు ఈ స్థాయిలో కోపం ఉందని అనుకోలేదు.  తమదే విజయం అనుకున్నా.. పార్టీకి తీరని నష్టం వస్తుందని అనుకోలేదు.  

ఎన్నికల్లో జరిగిన నష్టం కంటే పార్టీ పరంగా.. ఎమ్మెల్యేల పరంగా ఇప్పుడు పెద్ద నష్టం జరగబోతున్నట్టు తెలుస్తోంది.  తెలుగుదేశం పార్టీకి చాలా మంది నాయకులు ఇప్పటికే బీజేపీ వైపు చూస్తున్నారు. బీజేపీ వైపు చూడటమే కాదు.. అందులో జాయిన్ కావడానికి సన్నాహాలు కూడా సిద్ధం చేసుకుంటున్నారు.  

తెలుగుదేశం పార్టీ నాయకులతో పాటు.. ఆ పార్టీ ఎమ్మెల్యేలు చాలా మంది బీజేపీలో జాయిన్ కావడానికి సిద్ధం అవుతున్నారు. సిద్ధం కావడమే కాదు, రేపో మాపో సర్దుకొని జంప్ అవ్వడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నారు.  తాజా సమాచారం ప్రకారం మరో రెండు నెలల్లో ఐదురురు మినహా మిగతా వళ్ళంతా అంటే 18 మంది ఎమ్మెల్యేలు పార్టీ మారేందుకు రెడీ అవుతున్నట్టు తెలుస్తోంది.  

అయితే, ఈ 18 మంది ఎవరు.. ఎప్పుడు జాయిన్ అవుతున్నారు.  అందరు ఒకేసారి జాయిన్ అవుతారా లేదంటే ఒక్కొక్కరుగా జాయిన్ అవుతారా అన్నది తెలియాలి.  ఇదే 18 ఎమ్మెల్యేలు తెలుగుదేశం పార్టీ నుంచి బీజేపీలో జాయిన్ అయితే, తెలుగుదేశం పార్టీ ప్రతి పక్ష హోదాను కోల్పోవడం ఖాయం.  అంతేకాదు, రాజకీయాల్లో 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న బాబు కి ఇది పెద్ద అవమానమనే చెప్పాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: