జగన్ తీసుకుంటున్న సంచలన నిర్ణయాలు .. టీడీపీ పార్టీలో ప్రకంపనలు రేపుతున్నాయంటే అతిశయెక్తి కాదు. జగన్ తీసుకునే ప్రతి నిర్ణయం .. ప్రజలు జేజేలు పలుకుతున్నారు. తన తండ్రి పాలనను ప్రజలకు చూపిస్తున్నారని అందరూ చెప్పుకోవటం విశేషం. అయితే జగన్ ఇలా వస్తూనే అలా మొదలుపెట్టేసాడు. తక్కువో, ఎక్కువో పింఛన్లు పెంచాడు. ఉద్యోగులకు జీతాలు పెంచాడు. ఆశా వర్కర్లకు జీతాలు పెరిగాయి. ఆర్టీసీ కార్మికుల చిరకాల కోరిక తీర్చడానికి కమిటీ ఏర్పాటు అయ్యింది. 


అంగన్వాడీ, మధ్యాహ్న భోజన పథకం ఆయాలకు ఇంకా చాలామందికి తృణమో పణమో పెరిగాయి. రైతులకు ఏటా డబ్బులు వేయడం సంగతి అలావుంచితే, వ్యవసాయ కార్పొరేషన్ అన్నది గొప్ప చర్య. అలాగే రుణాలకు వడ్డీలు ప్రభుత్వం చెల్లించడం అన్నది మంచి ముందు అడుగు. కాస్త అపాత్ర దానం అయితే అవుతుంది. కానీ బ్యాంకులకు రుణాలు సక్రమంగా వెనక్కు వస్తాయి. ధరల స్థిరీకరణ నిధి, అలాగే ఇంకా చాలా చాలా నిర్ణయాలు జనాలను బాగా ప్రభావితం చేసేవే. ఇలా లక్షలాది మందిని ప్రభావితం చేసే నిర్ణయాలు తీసుకుంటూపోతే, జగన్ ను ఎవరు ఆపగలరు? 2024లో?


మంత్రివర్గ సమావేశంలో అవినీతి గురించి హెచ్చరించడంతో పాటు, ఆ విషయాన్ని బహిరంగంగా ప్రకటించేసారు. జగన్ సంగతి ఆ పార్టీ నాయకులకు బాగా తెలుసు. లేస్తే మనిషిని కాదు అనే బాబు టైపు హెచ్చరికలు కాదు. బయటకు పంపిస్తా అంటే పంపించేయడమే. ఇలా, ఇదే తరహాలో అయిదేళ్ల పాటు పాలిస్తే, ప్రశ్నించే పార్టీలు లేవు, ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీలు వుండవు. అన్నీ మూసుకోవడమే. 


మరింత సమాచారం తెలుసుకోండి: