వైకాపా రెండుసార్లు నగరి ఎమ్మెల్యేగా రోజా విజయం సాధించింది.  తెలుగుదేశం పార్టీ బయటకు వచ్చిన తరువాత వైఎస్ జగన్ వెంట నడిచింది.  జగన్ తోపాటు అడుగులు వేసింది.  వైకాపా ఏర్పాటు చేసినదగ్గరి నుంచి పార్టీలో మహిళా విభాగం అధ్యక్షురాలిగా పనిచేస్తోంది.  

మహిళా వాయిస్ ను వినిపించడంలో రోజా ఎప్పుడు ముందు ఉంటుంది అనడంలో సందేహం లేదు.  వైకాపా అధికారంలోకి వస్తే రోజాకు తప్పకుండా మంత్రి పదవి వస్తుందని అందరు అనుకున్నారు.  అదే విధంగా ప్రచారం కూడా జరిగింది.  ఇంకేముంది రోజాకు స్పీకర్ ఇస్తారు లేదంటే హోమ్ మంత్రి ఇస్తారని అనుకున్నారు. 

తీరా చివరకు వస్తే రోజాకు ఎలాంటి పదవి ఇవ్వలేదు.  చిత్తూరు జిల్లా నుంచి పెద్దిరెడ్డి నుంచి పోటీ ఎదురుకావడంతో రోజాకు పదవి లభించలేదు.  ఒకే సామాజిక వర్గానికి చెందిన వ్యక్తులకు పదవులు ఇవ్వకూడని అనుకున్నారు.  అందుకే రోజాకు పదవి లభించలేదు. 

మంత్రివర్గం విస్తరణ సమయంలో రోజా అమరావతిలో లేదు.  విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్ళిపోయింది.  రోజా అసంతృప్తి తో ఉన్న విషయం జగన్ చెవిన పడింది.  వెంటనే రోజాను పిలిపించారు.  ఆమెకు మూడు నామినేటెడ్ పదవులను ఆఫర్ చేసినట్టు తెలుస్తోంది.  మహిళా కమిషన్ చైర్ పర్సన్, ఆర్టీసీ చైర్ పర్సన్, రాయలసీమ అభివృద్ధి చైర్ పర్సన్ మూడు పోస్ట్ లలో ఒకటి కోరుకోవాలని రోజాకు అఫర్ చేయబోతున్నట్టు సమాచారం.  


మరింత సమాచారం తెలుసుకోండి: