ఏపీలో తొలి అసెంబ్లీ సమావేశాలు రేపటి నుంచి ప్రారంభం కాబోతున్నాయి. ఐదేళ్ల పాటు జరిగే ఈ అసెంబ్లీలో అధికార వైసీపీ ఆధిపత్యం రేప‌టి నుంచే స్ప‌ష్టంగా క‌నిపించ‌బోతోంది. అసెంబ్లీ లో ఉన్న మొత్తం 175 మంది ఎమ్మెల్యేల్లో విపక్ష టిడిపికి కేవలం 23 మంది ఎమ్మెల్యేలు మాత్రమే మిగిలారు. జనసేన నుంచి రాజోలులో ఒక్క‌ రాపాక వరప్రసాదరావు మాత్రమే విజయం సాధించారు. వైసీపీ నుంచి ఏకంగా 151 మంది ఎమ్మెల్యేలుగా గెలిచారు. తెలుగుదేశం పార్టీ పుట్టాక ఆ పార్టీ చరిత్రలోనే ఎప్పుడు లేని విధంగా కేవలం 23 మంది ఎమ్మెల్యేలు మాత్రమే ఉండడంతో... వీళ్ళతో ఐదేళ్ల పాటు అసెంబ్లీలో ఎలా ఫైట్ చేయాలో అర్థం కాక అప్పుడే చంద్రబాబు తలలు పట్టుకుంటున్నారు.


ఓ వైపు అసెంబ్లీలో అధికార వైసీపీపై పోరాటాలు... అధికార పార్టీ చేసే తప్పులను ఎత్తి చూపటం... ఇటు అసెంబ్లీ బయట ప్రజా సమస్యలపై పోరాటం చేయాలంటే 23 మంది ఎమ్మెల్యేలతో తన వల్ల సాధ్యం కాదన్న నిర్ణయానికి అప్పుడే చంద్రబాబు వ‌చ్చేశారని తెలుస్తోంది. కొత్త అసెంబ్లీలో ప్రారంభంలోనే మనం చాలా ఆసక్తికరమైన ఘట్టాలను చూడబోతున్నాం. ఇదిలా ఉంటే టిడిపి నుంచి గెలిచిన 23 మంది ఎమ్మెల్యేల్లో అప్పుడే కొంత మంది ఎమ్మెల్యేలు చంద్రబాబుకు టచ్ లోకి రావడం లేదని తెలుస్తోంది. చంద్రబాబు స్వయంగా ఫోన్ చేసినా ఈ ఎమ్మెల్యేల నుంచి ఎలాంటి రిప్లై లేదట.


టీడీపీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేల్లో ఐదారుగురు వరకు ఇప్పటికే బిజెపిలోకి చేస్తే ఎలా ? ఉంటుందన్న చర్చల్లో మునిగి తేలుతున్నారు. తెలుగుదేశం పార్టీలో ఉంటే ఐదేళ్లపాటు రాజకీయంగా ఎలాంటి భవిష్యత్తు లేదన్న నిర్ణయానికి వచ్చిన వీరు చంద్రబాబు, ఆయన వారసుడు లోకేష్ ను నమ్ముకుని రాజకీయంగా ఎలాంటి ఆశలు పెట్టుకోవడం లేదు. ఏదేమైనా తొలి రెండు, మూడు అసెంబ్లీ సమావేశాలకే టీడీపీలో ఉండే ఎమ్మెల్యేల్లో ఎవరు బయటకు వెళ్లిపోతారు ? ఎవరు ఉంటారు ? అన్న దానిపై క్లారిటీ వచ్చేయ‌నుంది. ఒక్క‌టి మాత్రం నిజం.. 40 సంవ‌త్స‌రాల పొలిటిక‌ల్ ఇండ‌స్ట్రీలియ‌లిస్ట్ చంద్ర‌బాబుకు ఐదేళ్ల పాటు పార్టీని కాపాడుకుంటూ.. అసెంబ్లీలో ఫైట్ చేయ‌డం ఆయ‌న లైఫ్‌లోనే పెద్ద అగ్నిప‌రీక్ష‌.


మరింత సమాచారం తెలుసుకోండి: