ముద్దుల మావ‌య్య‌.. బాల‌య్య గురించి, ఆయ‌న రాజ‌కీయ విన్యాసాల గురించి ఎంత చెప్పుకొన్నా త‌క్కువే అవుతుంది. ఆ య‌న రాజకీయ అరంగేట్రం చేసి దాదాపు ఆరేళ్లు అవుతోంది. సొంత వియ్యంకుడు చంద్ర‌బాబు ఆశీస్సుల‌తో రాజ‌కీ యా ల్లోకి వ‌చ్చిన బాల‌య్య‌.. అనంత‌పురంలోని టీడీపీ కంచుకోట హిందూపురం నుంచి 2014లోను, తాజా ఎన్నిక‌ల్లోనూ విజ యం సాధించారు. సాధార‌ణంగా సెల‌బ్రిటీలంటేనే అభిమానుల కోలాహ‌లాన్ని త‌ట్టుకోవ‌డం క‌ష్టం. ఇక‌, నంద‌మూరి బాల‌య్య విష‌యంలో అభిమానుల సంఖ్య‌కు అంతే ఉండ‌దు. ఆయ‌న హావ భావాల‌ను తెర‌మీద చూసిన అభిమానులు ఆయ‌న రాజ‌కీయాల నేప‌థ్యంలో నేరుగా ప్ర‌జ‌ల్లోకి రావ‌డంతో ఆయ‌నను చూసేందుకు ఎగ‌బ‌డుతుంటారు. 


అయితే, అభిమానుల సంద‌డిని చూసి.. ఆనందించాల్సిన బాల‌య్య‌.. మాత్రం ఫ్రెస్టేష‌న్‌కు గురైపోతూ.. చేయి చేసుకుం టున్న విష‌యం తెలియంది కాదు.ఒక్క హిందూపురంలోనే కాకుండా గ‌త ఏడాది తెలంగాణ లో జ‌రిగిన ఎన్నిక‌ల నేప‌థ్యంలో ఖ‌మ్మంలో టీడీపీ నేత‌ల త‌ర‌ఫున ప్ర‌చారం చేసిన స‌మ‌యంలోనూ త‌న‌ను చూసేందుకు వ‌చ్చి ఎగ‌బ‌డిన అభిమానుల‌పై ఆయ‌న చేయి చేసుకుని త‌రిమి కొట్టిన ప‌రిస్థితి మ‌నం చూశాం. ఇక‌, ఆయ‌న బ‌స చేసే హోట‌ల్ వ‌ద్ద కూడా ఇదే త‌ర‌హా హంగామా సృష్టించారు. త‌న‌ను చిత్రీక‌రిస్తున్న ఓ మీడియా వీడియో జ‌ర్న‌లిస్టుపైనా చేయి చేసుకోవ‌డం, త‌ర్వాత క్ష‌మాప‌ణ‌లు చెప్ప‌డం తెలిసిందే. 


ఇలా అయ‌న‌దానికి కాని దానికి కూడా బాల‌య్య ఫ్ర‌స్టేష‌న్‌కు గురి అవుతున్న ప‌రిస్థితి మ‌న‌కు తెలిసిందే. ఇక‌, ఇప్పుడు ఇలానే వ్య‌వ‌హ‌రిస్తూ.. వైర‌ల్ అవుతున్నారు జ‌న‌సేనానిప‌వ‌న్ క‌ళ్యాణ్‌. తాజాగా ఏపీలో జ‌రిగిన ఎన్నిక‌ల్లో ఘోర ప‌రాజయా న్ని చ‌విచూసిన ఆయ‌న ఈ ఓట‌మి నుంచి బ‌య‌ట‌కు రాలేక పోతున్నారు. అయినా కూడా రోజులు గ‌డిచి పోతుండ‌డంతో ఓట‌మిపై స‌మీక్షించుకుని, త్వ‌ర‌లోనే జ‌ర‌గ‌నున్న స్థానిక ఎన్నిక‌ల్లో అయినా స‌త్తా చాటాల‌ని నిర్ణ‌యించుకున్న నేప‌థ్యంలో ఇప్పుడు ఆయ‌న స‌మీక్ష‌ల‌కు దిగుతున్నారు. అయితే, ఈ క్ర‌మంలో పార్టీ కార్య‌క‌ర్త‌లు, నాయ‌కుల నుంచి వ‌స్తున్న వ్యాఖ్య‌ల‌ను ప‌వ‌న్ త‌ట్టుకోలేక పోతున్నారు. ఫ్ర‌స్ట్రేష‌న్‌కు గుర‌వుతున్నారు. 


తాజాగా సమీక్షా సమావేశానికి వచ్చిన ఓ అభామాని పార్టీని ఎలా నడపాలన్న విషయమై.. పవన్‌కే సలహా ఇచ్చే ప్రయత్నం చేసినట్లు సమాచారం. ఆ సలహాలను పవన్ సావధానంగా విన్నారు. అయితే ‘జనసేనకు ఓటు వేయని నీవు.. పార్టీ ఎలా నడపాలో సలహా ఇస్తున్నావా?’ అంటూ పవన్ అభిమానిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పుడు ఈ వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది. అయినా.. స‌మాజ మార్పు కోసం పార్టీ పెట్టాన‌ని, త‌న‌కు గెలుపు ఓట‌ముల‌తో ప‌నిలేద‌ని ప్ర‌క‌టించుకున్న ప‌వ‌న్ ఇలా బాల‌య్య త‌ర‌హాలో వ్య‌వ‌హ‌రిస్తుండ‌డం సంచ‌ల‌నంగా మారింది. రాబోయే రోజుల్లో మ‌రెన్ని సంగ‌తులు చూడాలో? అని అభిమానులే 


మరింత సమాచారం తెలుసుకోండి: