2019 ఎన్నికల్లో వైకాపా ఆంధ్ర ప్రదేశ్ లో దాదాపుగా స్వీప్ చేసింది. 175 స్థానాలకు గాని 151 స్థానాలలో విజయం అంటే మామూలు విషయం కాదు. ఇది ఏ లెక్కన చూసుకున్నా రికార్డ్.  2014లోనే అధికారం దక్కాల్సింది చేయి దాటి ఇప్పుడు దక్కింది.  అటు తెలంగాణలో తెరాస విజయం సాధించింది.  

తెరాస పార్టీ పై ఇప్పుడు అసమ్మతి పెరుగుతున్నది.  కెసిఆర్ ఛరిష్మా క్రమంగా తగ్గిపోతున్నది.  దీనికి నిదర్శనం పార్లమెంట్ ఎన్నికలే.  పార్లమెంట్ ఎన్నికల్లో ఆ పార్టీ అనుకున్న స్థానాలు తెచ్చుకోలేకపోయింది.  కాంగ్రెస్ పార్టీకి సంఖ్యాబలం లేదు.  దీంతో ఆ పార్టీ కోలుకుంటుంది అనే గ్యారెంటీ లేదు.  టిడిపి గురించి చెప్పాల్సిన అవసరం లేదు.  

అయితే, బీజేపీ పార్లమెంట్ ఎన్నికల్లో 4 స్థానాలు గెలుచుకున్నా.. ప్రాదేశిక ఎన్నికల్లో మాత్రం చతికిల పడింది.. దీంతో వచ్చే ఎన్నికల్లో ఏ పార్టీ వైపుకు ప్రజలు మొగ్గు చూపుతారో అర్ధంకాని పరిస్థితి.  కేటీఆర్ కు మాస్ లో బలం లేదు.  ఆ బలం ఉన్న హరీష్ రావును పార్టీ వరకే పరిమితం చేసింది. మొత్తంగా చెప్పుకోవాలి అంటే, తెలంగాణలో రాజకీయ సూన్యత స్పష్టంగా కనిపిస్తోంది.  

దీనిని జగన్ వినియోగించుకుంటాడని అనిపిస్తోంది.  2014లో ఒక ఎంపీ, మూడు ఎమ్మెల్యే స్థానాలు గెలుచుకున్న వైకాపా ఆ తరువాత ఏపీ పైనే దృష్టిపెట్టడంతో తెలంగాణలో పోటీ చేయలేదు.  ఏపీ లో అధికారంలోకి వచ్చింది కాబట్టి.. నెక్స్ట్ టార్గెట్ తెలంగాణనే అనడంలో సందేహం లేదు. 


మరింత సమాచారం తెలుసుకోండి: