టివి9 మాజీ సిఇఒ రవిప్రకాశ్‌ పై కావాలనే ఉద్దేశ పూర్వకంగా తెలంగాణా పోలీసులు కేసులు నమోదు చేశారని, ఆయన తరఫు న్యాయవాది దిల్‌ జిత్ సింగ్ అహ్లువాలియా వాదించగా, రవిప్రకాష్ ఫోర్జరీకి పాల్పడ్డారని, ఆయనకు ఎలాంటి పరిస్థితుల్లో బెయిల్ మంజూరు చేయకూడదంటూ పోలీసుల తరఫు న్యాయవాది వాదించారు. ఈ క్రమం లో రవిప్రకాశ్ తరపున ఇరువర్గాల వాదనలు విన్న హైకోర్టు కేసును ఈనెల 18వ తేదీకి (వచ్చే మంగళవారం) వాయిదా వేసింది.

పోలీసుల తరఫునవాదనలు వినిపించిన సుప్రీంకోర్టు సీనియర్ లాయర్ 'హారెన్ రావెల్' టివి9 రవిప్రకాష్ ఫోర్జరీకి పాల్పడ్డారని, దానికి సంబంధించిన ఫోర్జరీపత్రాలను హైకోర్టుకు సమర్పించారు. అదేవిధంగా 160-సిఆర్‌పిసి, 41ఏ నోటీసులు ఇచ్చిన కాపీలను కోర్టుకు సమర్పించారు. అదేవిధంగా మొబైల్‌లో రవిప్రకాష్ జరిపిన సంభాషణల స్క్రీన్-షాట్స్‌ను కూడా హైకోర్టు ముందుంచారు. పోలీసుల విచారణకు హాజరు కాకుండా హైదరాబాద్, బెంగళూరు, విజయవాడ తిరుగుతూ పోలీసులను ముప్పుతిప్పలు పెట్టారని కోర్టుకు వివరించారు. 
Image result for ravi prakash tv9 in High court today
రవిప్రకాశ్ ₹90 నుంచి ₹100 కోట్ల విలువచేసే టివి 9 లోగోను ₹ 99000 ఎలా విక్రయించాని ప్రశ్నిస్తే తాను టివి9 కంపెనీకి యజమానిని పేర్కొంటున్నారని హైకోర్టుకు లాయర్ తెలిపారు. ముఖ్యంగా టివి9 లో కేవలం 9శాతం వాటా ఉన్నవాళ్లు ఎలా యజమాని అవుతారని న్యాయవాది ప్రశ్నించారు.


అదే సంస్థలో 90 శాతం వాటా ఉన్నవారి పరిస్థితేంటన్నారు. ఫోర్జరి, కుట్ర, నిధుల మళ్లింపు, డేటాచోరి కేసుల విషయంలో రవిప్రకాశ్‌ను దర్యాప్తు చేయాల్సి ఉందన్నారు. రవిప్రకాష్ బయట ఉంటే తప్పకుండా సాక్ష్యాలను ప్రభావితం చేసే అవకాశం ఉందని, ఎట్టి పరిస్థితుల్లో బెయిల్ మంజూరు చేయొద్దని హైకోర్టు ధర్మాసనానికి పోలీసుల తరఫు సుప్రీంకోర్టు సీనియర్ లాయర్, హారెన్ రావెల్ విన్నవించారు. కాగా కౌంటర్‌ గా రవిప్రకాష్ తరఫు న్యాయవాది దిల్‌ జిత్ సింగ్ అహ్లువాలియా తన క్లైంట్ ఫోన్ సంభాషణలకు సంబంధించి స్క్రీన్-షాట్లను కోర్టుకు సమర్పించ డంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. తన క్లయింట్ మొబైల్ ఫోన్‌ లో ఉన్న డేటాను స్క్రీన్-షాట్స్ ఎలా తెస్తారని ప్రశ్నలు సంధించారు.
Image result for ravi prakash tv9 in High court today
పోలీసులు కావాలనే లోగో వ్యవహారాన్ని తెరమీదకు తెస్తున్నారని అన్నారు. టివి9 లోగో సృష్టికర్త రవిప్రకాష్ అని, కాపీ రైట్ చట్టం సెక్షన్ 70 ప్రకారం లోగోపై పూర్తి హక్కు అతనికే ఉంటుందని వాదించారు. 2003నుంచి టివి 9 కంపెనీ వ్యవస్థాపకుడిగా రవిప్రకాష్ వ్యవహరిస్తూ వచ్చారని, సివిల్ తగాదాల్లో పోలీసులు జోక్యం చేసుకోవడం మంచిది కాదన్నారు. తన క్లైంట్ రవిప్రకాష్‌కు బెయిల్ ఇస్తే ఎవరికి ఎలాంటి ఇబ్బందులులేవని, బెయిల్ మంజూరు చేయాలని న్యాయవాది దిల్‌ జిత్ సింగ్ అహ్లువాలియా కోరడంతో ఏ ప్రాతిపదికన రవిప్రకాశ్‌కు బెయిల్ మంజూరు చేయాలని హైకోర్టు ప్రశ్నించింది. ఈ క్రమంలో హైకోర్టులో సమయం దాటి పోవడంతో విచారణ ను ఈనెల 18వ తేదీ నాటికి వాయిదా వేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: