ఏపీ ముఖ్య‌మంత్రిగా వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి ప్ర‌మాణ‌స్వీకారం చేయ‌డానికి ముందుమాట‌. ఇంకా స్ప‌ష్టంగా చెప్పాలంటే...ఎన్నిక‌ల ప్ర‌చారం హోరాహోరీగా సాగుతున్న త‌రుణ‌మ‌ది. అప్ప‌టికే ముఖ్య‌మంత్రిగా ఉన్న చంద్ర‌బాబు నాయుడును సాగ‌నంపాల‌ని ప్ర‌జ‌లు నిర్ణ‌యం సంద‌ర్భమ‌ది. అలాంటి స‌మ‌యంలో...ఓట‌మిపై క్లారిటీ వ‌చ్చేసిన టీడీపీ అధ్య‌క్షుడు చంద్ర‌బాబు ఓ కామెంట్ చేశారు. ఒకవేళ ఏపీలో వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి గెలిస్తే...రాష్ట్రం ఏమైపోతుందో అనే అప‌న‌మ్మ‌కంతో పెట్టుబ‌డిదారులు ఉన్నార‌ని...జ‌గ‌న్ వస్తే మేం రాష్ట్రం వైపు చూసేది లేద‌ని త‌న‌తో అన్నార‌ని చంద్ర‌బాబు డ‌బ్బా కొట్టుకున్నాడు. క‌ట్ చేస్తే...తాజా ప‌రిణామాల‌తో చంద్ర‌బాబు త‌ల ఎక్క‌డ పెట్టుకుంటార‌ని వైసీపీ శ్రేణులు ప్ర‌శ్నిస్తున్నారు. 

చంద్ర‌బాబు ప్ర‌జావ్య‌తిరేక పాల‌న‌ను చీ కొట్టిన ప్ర‌జ‌లు రికార్డు స్థాయి మెజార్టీతో జ‌గ‌న్‌ను సీఎం పీఠంపై కూర్చోబెట్టిన సంగ‌తి తెలిసిందే. ముఖ్య‌మంత్రిగా సీఎం పీఠంపై కూర్చున్న‌ది మొద‌లు..జ‌గ‌న్ త‌న‌దైన శైలిలో నిర్ణ‌యాలు తీసుకుంటున్నారు. సంక్షేమ- అభివృద్ధి రాష్ట్రంగా ఏపీని అయితే అవ‌న్నీ ప‌టాపంచ‌లు చేస్తూ రాష్ట్రంలోకి పెట్టుబ‌డుల ప‌ర్వం మొద‌లైంది. ఐదు దేశాల్లో విస్తరించిన ఆదిత్య బిర్లా గ్రూపు సంస్థల్లో ఒకటైన అల్ట్రాటెక్ సిమెంట్ కంపెనీ ఆంధ్రప్రదేశ్‌లో రూ.2వేల 500కోట్ల భారీ ప్రాజెక్టు చేపట్టనుంది. ఆంధ్రప్రదేశ్ పర్యావరణ మంత్రిత్వ శాఖ భారతదేశంలోని మంచి నాణ్యత గల ఉత్పత్తిగా పేరొందిన అల్ట్రాటెక్ సిమెంట్ ఇండస్ట్రీకి అనుమతి ఇవ్వడంతో కర్నూలు జిల్లాలోని పెట్నికొటె గ్రామంలో ఈ ప్రాజెక్టు పనులు మొదలుపెట్టారు. ఇంటిగ్రేటెడ్ సిమెంట్ ప్లాంటును ఏర్పాటు చేసి 900 మందికు పైగా ఉపాధి కల్పించనున్నారు. ప్రాజెక్టు నిర్మాణానికి దాదాపు 2500 కోట్లతో 431.92హెక్టార్ల భూమిని ఇప్పటికే కంపెనీ కొనుగోలు చేసింది. అంతకుముందు ఉన్న బిల్డింగ్‌లు, లేదా మరే ఇతర రకమైన సదుపాయాలను వాడుకోకుండా పునాదుల నుంచి కొత్తగా ఈ ప్రాజెక్టును అల్ట్రాటెక్ సిమెంట్ కంపెనీ రూపొందించనుంది  ఆంధ్రప్రదేశ్ కాలుష్య నివారణ బోర్డు నుంచి అనుమతులు వస్తే.. ఇక ప్లాంటు మొదలైపోయినట్లే. 

ప్ర‌జ‌ల్లో భ‌య‌భ్రాంతుల‌ను సృష్టించేందుకు....త‌న పాల‌న‌కు మ‌ద్ద‌తుగా ప్ర‌జ‌లు ఓట్లు వేయ‌ర‌ని గ్ర‌హించి ఓట్లు రాబ‌ట్టుకునే చంద్ర‌బాబు చేసిన కుత్సిత ఎత్తుగ‌డే జ‌గ‌న్ వ‌స్తే పెట్టుబడులు రావ‌నే ప్ర‌చార‌మ‌ని వైసీపీ శ్రేణులు మండిప‌డుతున్నాయి. జ‌గ‌న్‌పై ఆనాడే దుష్ప్ర‌చారం చేసిన చంద్ర‌బాబు తాజా పెట్టుబ‌డుల నేప‌థ్యంలో త‌ల ఎక్కడ పెట్టుకుంటారని వైసీపీ నేత‌లు కొంద‌రు ప్ర‌శ్నిస్తున్నారు. ఏపీలో పెట్టుబ‌డుల పర్వం ప్రారంభం అయింద‌ని....ఇదే  ఒర‌వ‌డి ఇక‌ముందు కొన‌సాగుతుంద‌ని అంచనా వేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: