2018 అక్టోబర్లో మొదలైన ముఖ్యమంత్రి యువనేస్తం నిరుద్యోగ భృతి పథకం గురించి క్లారిటీ వచ్చేసినట్లే.తెలిసిన సమాచారం మేరకు ఈ పథకం కొనసాగే అవకాశాలైతే లేనట్లే. జగన్మోహన్ రెడ్డి గారు నిర్వహించిన కేబినేట్ సమావేశంలో ఈ పథకం రద్దు చేసినట్లు తెలుస్తుంది

 

అక్టోబర్ 2 నుండి అర్హులైన వారు వెయ్యి రుపాయలు భృతి పొందగా మార్చి నెల నుండి ఆ భృతి ని ఎన్నికల కోడ్ అమలులో లేని జిల్లాల్లో 2000 రుపాయలకు పెంచారు. సుమారుగా ఐదు లక్షల 27 వేల మంది నిరుద్యోగులు ఈ భృతికి అర్హులుగా ఎంపికయ్యారు.

 

త్వరలో గ్రామ వాలంటీర్ల , గ్రామ సచివాలయంలో ఉద్యోగులను నియామకం చేపట్టబోతున్నారు. ఈ ఉద్యోగాల ద్వారా పెద్ద ఎత్తున నిరుద్యోగుల సంఖ్య ఆంధ్రప్రదేశ్లో తగ్గుముఖే పట్టే అవకాశం ఉంది. గ్రామ వాలంటీర్లు, గ్రామ సచివాలయంతో నిరుద్యోగులకు భద్రత కల్పిస్తున్నందున యువనేస్తం పథకం రద్దు చేస్తున్నట్లు తెలుస్తుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: