2014ఎన్నికల్లో రైతు రుణమాఫీ హామీతో అధికారం సాధించాడు చంద్రబాబు. హామీ పట్ల ఆకర్షితులైన రైతుల ఓట్లన్నీ చంద్రబాబు నాయుడు గారిని గెలిపించాయి. హామీ ఆచరణ సాధ్యం కాదని జగన్ రుణ మాఫీ హామీని 2014 ఎన్నికల్లో ప్రకటించలేదు. తీరా గెలిచిన తరువాత రుణమాఫీని ఐదు విడతల్లో అందిస్తానని చెప్పాడు చంద్రబాబు

 

కానీ గత ఐదేళ్ళ టీడీపీ హయాంలో మూడు విడతల రుణమాఫీ మాత్రమే సక్రమంగా జరిగింది. నాలుగో విడత రుణమాఫీ విడుదల చేసామని చెప్పిన అది పూర్తి స్థాయిలో రైతులకు అందలేదు. అధికారంలో ఐదేళ్ళు ఉండి తను నెరవేర్చని హామీకి జగన్ ప్రభుత్వాన్ని నిధులు విడుదల చేయమంటున్నాడు చంద్రబాబు

 

ఐదు సంవత్సరాలపాటు ప్రభుత్వాన్ని నడిపి అప్పుడు అమలు చేయకుండా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు తీర్చాలనడం విధంగా న్యాయమో చంద్రబాబుకే తెలియాలి. చెప్పిన హామీలను చంద్రబాబు నాయుడు సక్రమంగా అమలు చేసి ఉంటే అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీకి ఇంత దారుణమైన ఫలితాలు మాత్రం వచ్చి ఉండేవి కాదేమో


మరింత సమాచారం తెలుసుకోండి: