అమ్మ ఒడి పథకం ద్వారా 15,000 రుపాయలు ఇస్తానని జగన్మోహన్ రెడ్డి గారు తన నవరత్నాల్లో హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. సీఎం అయిన తరువాత కేబినేట్లో వచ్చే సంవత్సరం జనవరి 26 నుండి పథకం అమలు కాబోతుంది. గ్రామ వాలంటీర్ల ద్వారా తెల్ల రేషన్ కార్డు ఉండి పిల్లలను చదివిస్తున్న తల్లులకు అమ్మ ఒడి పథకం ద్వారా చెక్కులు అందజేయబోతున్నారు

 

పథకం కేవలం ప్రభుత్వ పాఠశాలలకు మాత్రమే అమలు చేస్తారని తద్వారా ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థుల సంఖ్య మెరుగుపడుతుందని అందరూ భావించారు. కానీ అంచననాలకు భిన్నంగా ప్రైవేట్ పాఠశాలలో కూడా చదివే పిల్లలలకు పథకం వర్తింపచేయటం మంచిది కాదనే మాటలు వినిపిస్తున్నాయి

 

ప్రైవేట్ పాఠశాలలు పథకాన్ని దుర్వినియోగం చేసే అవకాశం కూడా ఉంది. ప్రభుత్వ పాఠశాలలకు విద్యార్థులను పంపేవారు పేదవారు మాత్రమే అయి ఉంటారు వీరికి కుటుంబాల్లో పిల్లలను పోషించటం కూడా కష్టంగా ఉంటుంది. ఇలాంటివారికి మాత్రమే పథకం అమలు చేసి ఉంటే బాగుండేదని కొందరు ప్రజలు అభిప్రాయపడుతున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: