తాడిపత్రి... జేసీ దివాకర్ రెడ్డి కంచుకోట! ఒక సారి కాదు రెండు సార్లు కాదు.. అనేక సార్లు ఇక్కడ నుంచి ఎన్నికల్లో ఘన విజయం సాధిస్తూ వచ్చాడు దివాకర్ రెడ్డి. కేవలం ఎన్నికల్లో విజయం సాధించడం ఒక్కటే కాదు... తాడిపత్రిలో అనేక రూపాల్లో జేసీ ఆధిపత్యముంది. జేసీ తమ్ముడు ఇక్కడ మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ హోదాల్లో పట్టణంపై పట్టు సంపాదించాడు. ఇక్కడ కాస్తంత పెద్ద వ్యాపారాలు, కాంట్రాక్టులు జేసీ బ్రదర్స్ కను సన్నల్లోనే జరుగుతుంటాయి. తాడిపత్రిపై ఆధిపత్యం సాధించిన దివాకర్ రెడ్డి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాకా మొత్తం అనంతపురం జిల్లాపైనే పట్టు సాధించడానికి ప్రయత్నించాడు. ఆ ప్రయత్నంలో ఫెయిల్యూర్ అయినా.. తాడిపత్రిపై మాత్రం జేసీకి తిరుగులేని ఆధిపత్యం ఉంది. 

 అలాంటిది ఇప్పుడు ఆ పట్టణంలో జేసీ ట్రావెల్స్ పై దాడి జరగడం అంటే మాటలు కాదు! దివాకర్ ట్రావెల్స్‌పై వైసీపీ నాయకులు దాడి చేశారని తెలుస్తోంది. ఫర్నిచర్‌ను ధ్వంసం చేసి అందులో పనిచేస్తున్న ఇరువురు సిబ్బందిపై దాడిచేశారు. నిరవధిక నిరాహారదీక్ష చేస్తున్న వైసీపీ తాడిపత్రి నియోజకవర్గ సమన్వయకర్త వీఆర్ రామిరెడ్డి శిబిరం సమీపంలో ఈ సంఘటన జరగడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. 

 అసలు జేసీ ఆఫీసుపై దాడికి పూనుకోవడం అంటే అది అలాంటిలాంటి సాహసం కాదు. జేసీని ఢీ కొనడం అంటే మాటలు కాదు. అయితే సమైక్యవాదం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఆ శక్తిని ఇచ్చింది. జేసీ ని విమర్శించడానికి కూడా భయపడాల్సింది పోయి.. జేసీ ఆఫీసులపై దాడు అంటే పర్యవసనాలకు సిద్ధపడే దాడికి దిగారని అనుకోవాలి. సమైక్యవాద ఉద్యమంలో భాగంగా రెండు నెలలుగా బంద్ కొనసాగుతున్నా.. జేసీ బస్సులు మాత్రం తిరిగాయి. ఇప్పుడు ప్రత్యర్థులు ఆ బస్సుల ఆఫీసుపై దాడికి దిగారు. మరి ఇతి తాడిపత్రి

మరింత సమాచారం తెలుసుకోండి: