తెలుగు రాష్ట్రాల మధ్య ఏర్పడిన వివాదంతో రెండుగా విభజించబడినది. నవ్యాంధ్రప్రదేశ్ లో తోలిసారి ఎన్నికైన తెలుగుదేశం పార్టీ రాష్ట్ర భవిష్యత్తుకు అహర్నిసలు శ్రమించింది. కొత్తగా ఏర్పడిన రాష్ట్రంలో త్వరగా రాజధాని నిర్మాణం పూర్తి చేయాలని పార్టీ అధినేత, గత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నిశ్చయించుకున్నారు.

రాజథాని నిర్మాణానికి శ్రీకృష్ణ కమిటీని ఏర్పాటు చేసి అమరావతి అనువైన ప్రదేశంగా నిర్ణయించారు. ఇక అమరావతిలో 33వేల ఎకరాల సేకరణ, భవనాల ఏర్పాట్ల పనులు చక చక జరుగుతున్నాయి. తాత్కాలిక భవనాలు ఏర్పాటు చేసి అక్కడ నుంచే రాష్ర్ట ప్రయోజనాలను సమీక్షించారు చంద్రబాబు. అసెంబ్లీ సమావేశాలకు అందరూ హైదరాబాద్ వెళ్ళాల్సి వస్తుంది. ఈ భారం రాష్ట్రంపై పడుతుందని మొదట నాగార్జున యూనివర్శిటి క్యాంపస్ లో అసెంబ్లీ సమావేశాలు నిర్వహించారు. తాత్కాలిక భవనాలు పూర్తైన తర్వాత అందులోనే అసెంబ్లీ సమావేశాలను రెండు సంవత్సరాల పాటు నిర్వహించారు. అమరావతి  నిర్మాణానికి కంకణం కట్టుకొన్న చంద్రబాబు 2019 ఎన్నికల్లో ఓటమి పాలై ప్రతిపక్ష హోదాలో ఉన్నారు.

ఇక నవ్యాంధ్ర ప్రదేశ్‌ ప్రతిపక్ష నేతగా తొలిసారి అసెంబ్లీ ఇవాళ అడుగుపెట్టారు చంద్రబాబునాయుడు. పార్టీ ఎమ్మెల్యేలతో కలిసి కొద్దిసేపటి క్రితం ఆయన అసెంబ్లీకి చేరుకున్నారు. అంతకముందు వెంకటపాలెంలో ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అసెంబ్లీకి చేరుకున్న వెంటనే తనకు కేటాయించిన విపక్ష నేత ఛాంబర్‌లోకి వెళ్లిపోయారు. ప్రస్తుత ప్రభుత్వం వైసీపీ ప్రతిపక్ష తెలుగుదేశం నేతల కోసం ఛాంబర్లను సిద్ధం చేసింది.


మరింత సమాచారం తెలుసుకోండి: