విధి ఎప్పుడు ఎవరితో ఎలా ఆదుకుంటుందో చెప్పలేము.  మనం ఒకటి తలిస్తే ... అక్కడ మరొకటి జరుగుతుంది.  చెప్పాలంటే ఎవరికి ఏది రాసిపెడితే అది జరుగుతుంది.  మన చేతుల్లో ఏమిలేదు.  ఇది సామెత అనుకుంటే పొరపాటే నిజం.. జీవిత సత్యం కూడా.

చంద్రబాబు విషయంలో ఇదే జరిగింది. 1999 తరువాత తెలుగుదేశం పార్టీ వరసగా రెండుసార్లు పరాజయం పాలైంది.  అయినా బాబు కృంగిపోలేదు.  ధైర్యంతో ముందుకు కదిలాడు.  ఫలితం 2014 లో ఎన్నికల్లో విజయం.  ఎన్నికల్లో విజయం సాధించేందుకు బహు నానారకాల హామీలు ఇచ్చారు.  

ఇవే బాబు ఓటమికి కారణం అయ్యాయి.  ఇది వేరే విషయం అనుకోండి.  అసలు కథ ఏంటంటే.. బాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో పదోతరగతిలో స్టేట్ ఫస్ట్ ర్యాంక్ వచ్చిన విద్యార్థిని గుడ్ లుక్ బాగా చదువుకొని ఉన్నత స్థానంలోకి రావాలని ఆశీర్వదించాడు.  

బాబు ఆశీర్వాదమో లేదంటే మరేదైనా కావొచ్చు.. ఆ విద్యార్థి డాక్టర్ అయ్యాడు.. అక్కడితో ఆగకుండా.. 2019 లో జరిగిన ఎన్నికల్లో శ్రీకాకుళం జిల్లా పలాస నుంచి వైకాపా తరపున పోటీ చేసి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిని చిత్తుగా ఓడించి అసెంబ్లీలోకి అడుగుపెట్టబోతునున్నాడు.  అతనే డాక్టర్ అప్పలరాజు.  


మరింత సమాచారం తెలుసుకోండి: