జగన్‌ గారు, జర జాగ్రత్త...? 
మెయిన్‌ స్ట్రీమ్‌ మీడియా చెప్పని అసలైన ముచ్చట్లు సోషల్‌ మీడియా చెబుతుంది..
సీనియర్‌ జర్నలిస్టు సత్యమూర్తి గారు...
' ఎక్కడి సినారె, ఎక్కడి యార్లగడ్డ...? ఎక్కడి జగన్‌..? ఏమిటీ సంబంధం..? అధికారంలో ఉన్నవారి దగ్గరకు కొందరు ఎలాగైనా చేరతారు... ఎవరూ ఆపలేరు...' అంటూ చేసిన కామెంట్‌ పొలిటికల్‌ సర్కిల్స్‌లో హాట్‌ టాపిక్‌గా మారింది. 

ఇలాంటి సమయంలో జగన్‌ కాస్త జాగ్రత్తగా ఉండాలి. హిందీ పండితుడు యార్లగడ్డ అంటే సామాన్యుడు కాదు. చక్కటి మాటకారి, ముఖ్యమంత్రులను ఆకట్టుకోవడంలో ముందుంటాడు. ఆయన ఎప్పటి లాగే ఒక పుస్తకం రాశాడు. తనకు తెలిసిన వారిని పట్టుకొని ముఖ్యమంత్రి జగన్‌తో ఆవిష్కరింప చేయించుకున్నాడు. 

కొసమెరుపు ఏమంటే...? ఈ కార్యక్రమంలో మాట్లాడిన యార్లగడ్డ ''పుస్తకాన్ని ఆవిష్కరించమని ఎప్పుడో కోరాను. ముఖ్యమంత్రి హోదాలో ఆవిష్కరిస్తానని జగన్‌ చెప్పారు. అలాగే జరిగింది...'' అని పొగడ్తలతో ముంచెత్తారు.
సో యార్ల గడ్డ దగ్గర అంత టాలెంట్‌ ఉన్నపుడు, జగన్‌ మాత్రం ఏం చేయగలరు..? 

సరే, ఇదంతా చూసి రేపటి నుండి కవులు రచయితలు ఆవిష్కరణల కోసం, సీఎం ఆఫీసు చుట్టూ తిరగ మాకండి... యార్లగడ్డ కాబట్టి సాధించాడు, ఎవరి వల్లా కాదు. 


మరింత సమాచారం తెలుసుకోండి: