అధికారం శాశ్వతం కాదు..తాత్కాలికం మాత్రమే..తరువాత తారుమారు అవుతుంది అని తెలిసినా గత ఐదేళ్లు చంద్రబాబుతో సహా టీడీపీ ఎమ్మెల్యేలు అహంకారంతో మిడిసిపోయారు.  ప్రతిపక్షనాయకుడు జగన్‌కు కనీస మర్యాద ఇవ్వకుండా లక్షకోట్ల దొంగ, పదహారు నెలలు జైలులో గడిపిన ఆర్థిక నేరస్థుడు అంటూ యనమల, అచ్చెంనాయుడు, గోరంట్ల, దేవినేని ఉమ, బోండా ఉమ లాంటి టీడీపీ ఎమ్మెల్యేలు అడ్డగోలుగా కూతలు కూసారు. ఇక రోజా, కొడాలి నాని వంటి అగ్రెసివ్ నాయకులపై ఐరెన్‌లెగ్‌లు, రేయ్..ఏంట్రా కోసేత్తా నా కొ..కా అంటూ  టీడీపీ ఎమ్మెల్యేలు బూతులతో విరుచుకుపడేవారు. ప్రతిపక్ష నాయకుడిగా కేబినెట్ హోదా కలిగిన జగన్‌పై హుందాగా విమర్శలు చేసేది పోయి..దొంగ, 420 అంటూ నీచమైన వ్యాఖ్యలు చేశారు.

ఇక చంద్రబాబు కూడా జగన్‌‌ను, వైసీపీ ఎమ్మెల్యేలను మీ కథ తేలుస్తా.. అంతు చూస్తా..తమాషా చేస్తున్నారా అంటూ అసెంబ్లీ సాక్షిగా బెదిరించారు. ప్రతిపక్షనేత జగన్‌, వైసీపీ ఎమ్మెల్యేలపై చంద్రబాబు, టీడీపీ నేతలు వ్యవహరించిన తీరును  ప్రజలు గమనించారు. రాజకీయంలో 40 ఏళ్ల అనుభవం ఉన్న చంద్రబాబు 40 ఏళ్ల జగన్‌ పట్ల వ్యవహరించిన తీరుపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఏర్పడింది. చంద్రబాబు, టీడీపీ నేతల అవినీతిని, దౌర్జన్యాలను గమనించిన ఏపీ ప్రజలు ఈ ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్పారు. సభలో సభ్యత, సంస్కారం లేకుండా వ్యవహరించిన టీడీపీని అసహ్యించుకున్న ప్రజలు ఈ సార్వత్రిక ఎన్నికల్లో  తిరుగులేని మెజారిటీతో వైసీపీకి అధికారం కట్టబెట్టారు.   కేవలం 23 సీట్లలోనే గెలిపించి టీడీపీని ప్రతిపక్షంలో కూర్చోబెట్టారు.


 తాజాగా ఇవాళ ఏపీ అసెంబ్లీలో జగన్ సర్కారు కొలువు దీరింది. ఐదేళ్ల తర్వాత ప్రతిపక్ష వైసీపీ అధికార పార్టీగా , అధికార టీడీపీ ప్రతిపక్షంగా మారింది. సభా నాయకుడిగా  ముఖ్యమంత్రి జగన్ తొలుత ప్రమాణ స్వీకారం చేయగా, ఆనవాయితీ ప్రకారం జగన్ తర్వాత చంద్రబాబు ప్రతిపక్ష నాయకుడిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఇక ఆ తర్వాత అక్షర క్రమంలో వైసీపీ ఎమ్మెల్యేలు, టీడీపీ ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం చేశారు.  కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తొలి సారిగా జరుగుతున్న అసెంబ్లీ సమావేశాల్లో వైసీపీ ఎమ్మెల్యేలు ఉత్సాహంగా పాల్గొంటే...టీడీపీ ఎమ్మెల్యేలంతా మొహాలు వేలాడేసుకుని, దిగాలుగా కనిపించారు. 

జగన్ అధికారంలోకి వచ్చిన బాధ కంటే..తాము అధికారం కోల్పోయామే అన్న బాధ చంద్రబాబుతో సహా, టీడీపీ ఎమ్మెల్యేలలో కనిపించింది.  మొన్నటి దాకా..అధికార పార్టీ స్థానాల్లో కూర్చుని, ఇప్పుడు ప్రతిపక్షానికి కేటాయించిన సీట్లలో కూర్చోవాల్సి రావడంతో చంద్రబాబుతో సహా టీడీపీ ఎమ్మెల్యేలు అవమానంగా ఫీల్ అవుతున్నారు. 


అధికార పార్టీ ఎమ్మెల్యేలుగా ఇదే అసెంబ్లీలో వైభవంగా బతికిన తాము..ఐదేళ్లలోనే సీన్ రివర్సై ..ఇలా ప్రతిపక్షంలో కూర్చుంటామని అస్సలు  ఊహించలేదని  టీడీపీ ఎమ్మెల్యేలు తమలో తాము చెప్పుకుని బాధపడ్డారని సమాచారం. ఐదేళ్ల పాటు అధికార పార్టీగా ఇష్టారాజ్యంగా అసెంబ్లీలో వ్యవహరించిన చంద్రబాబు, మంత్రులుగా అడ్డగోలుగా జగన్‌పై నోరు పారేసుకున్న అచ్చెంనాయుడు, గోరంట్ల వంటి నేతలు ఇప్పుడు అవమానకరరీతిలో ప్రతిపక్ష స్థానాల్లో కూర్చోవాల్సి వచ్చేసరికి తీవ్రమైన మనోవేదనకు గురైనట్లు సమాచారం.

ఇంత బతుకు బతికి, జగన్ని నానా మాటలు అని, ఇప్పుడు సీఎం జగన్‌తో పాటు కొడాలి నాని, రోజా వంటి నేతలు అంగరంగ వైభవంగా ప్రమాణ స్వీకారం చేస్తుంటే..చంద్రబాబుతో సహా, టీడీపీ ఎమ్మెల్యేలలో ఒక్కరి మొహంలో కూడా జీవం కనిపించలేదు. అధికారం శాశ్వతం అని అహంకారంతో మిడిసిపడితే..ప్రజలు క్షమించరని..సమయం వచ్చినప్పుడు ఇలా గుణ పాఠం నేర్పుతారని టీడీపీ నేతలు భావిస్తే మంచిది. ఇకనైనా బాధ్యతాయుతమైన ప్రతిపక్షంలో ప్రజా సమస్యలపై పోరాడితే పోయిన గౌరవం కాస్త మళ్లీ తిరిగి వస్తుంది. మొత్తానికి ఇవాళ అసెంబ్లీలో చంద్రబాబుతో సహా, టీడీపీ ఎమ్మెల్యేల మొహాల్లో జీవం కనిపించడం లేదంటూ..నెట్‌జన్లు ఓ రేంజ్‌లో సెటైర్లు వేస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: