అదృష్టవంతుడిని ఎవరు చెడగొట్ట లేరు.. దురదృష్టవంతుడిని ఎవరు బాగు చేయలేరు.. అన్న సూత్రం ఆ టిడిపి సీనియర్ నేతకు ఖచ్చితంగా వర్తిస్తుంది. 1994 ఎన్నికల నుంచి తాజా ఎన్నికల వరకు ఓటమి అనేది లేకుండా వరుస విజయాలు సాధిస్తూ వచ్చిన ఆ సీనియర్ నేత.. ఈ ఎన్నికల్లో తన కెరీర్లోనే తొలిసారిగా ఓడిపోయారు. తండ్రి నుంచి వచ్చిన బలమైన రాజకీయ వారసత్వాన్ని అందిపుచ్చుకున్న ధూళిపాళ్ల నరేంద్రకుమార్ గుంటూరు జిల్లా పొన్నూరు నుంచి వరుసగా ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. 


తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా జిల్లాలో నరేంద్ర మాత్రం విజయం సాధించారు. అలాంటి నరేంద్ర ను చంద్రబాబు 2014 ఎన్నికల్లో గెలిచాక పూర్తిగా పక్కన పెట్టారు. జిల్లాలో తనకన్నా జూనియర్లు... ఎన్నికల్లో ఓడిపోయినా నేతలను  అందలం ఎక్కించిన చంద్రబాబు నరేంద్రను మాత్రం లైట్ తీసుకున్నారు. ఈ క్రమంలోనే ఐదు సార్లు గెలిచిన గత ఐదేళ్ల పాటు నరేంద్ర కేవలం తన నియోజకవర్గానికి మాత్రం పరిమితమైపోయారు.


ఇక‌, తాజా ఎన్నిక‌ల‌కు ముందు వైసీపీ నుంచి ఓ ఆఫ‌ర్ వ‌చ్చింది. త‌మ పార్టీలోకి వ‌స్తే.. మంత్రి ప‌ద‌వి ఇస్తామ‌ని ధూళిపాళ్లకు ఆఫ‌ర్ ఇచ్చారు వైసీపీ కీల‌క నేత‌లు.ఈ ఆఫ‌ర్‌ను జ‌గ‌న్ స్వ‌యంగా త‌మ పార్టీ నేత‌ల చేత ఆయ‌న‌కు పంపించార‌ట‌. ఈ ఎన్నిక‌ల్లో వైసీపీ టిక్కెట్ల వ్య‌వ‌హారాలు, ఇత‌ర‌త్రా అంశాల్లో చ‌క్రం తిప్పిన ఓ కీల‌క నేత నేరుగా న‌రేంద్ర‌ను అప్రోచ్ అయ్యారు. మా పార్టీలోకి రండి... మీ గౌర‌వానికి త‌గిన‌ట్టుగా చూసుకుంటాం.. అంతే కాకుండా మంత్రి ప‌ద‌వి కూడా ఇస్తామ‌ని చెప్పారు. అయితే న‌రేంద్ర మాత్రం జ‌గ‌న్ ఆఫ‌ర్‌ను తిర‌స్క‌రించారు.


ఇక ఇప్పుడు న‌రేంద్ర ఎమ్మెల్యేగా కూడా ఓడిపోయారు. వ‌రుస విజ‌యాలు సాధిస్తూ డ‌బుల్ హ్యాట్రిక్ కొడ‌తాన‌ని ధీమా పోయిన న‌రేంద్ర‌ను తాజా ఎన్నిక‌ల్లో పోటీ చేసిన కిలారు రోశ‌య్య ఓడించారు. వాస్త‌వానికి ఇక్క‌డ న‌రేంద్ర వైసీపీలోకి రాన‌ని చెప్ప‌డంతో ఆ త‌ర్వాత జ‌గ‌న్ టీం మాజీ స్పీక‌ర్ నాదెండ్ల మ‌నోహ‌ర్‌ను కూడా క‌లిశారు. అయితే నాదెండ్ల  మాత్రం జ‌న‌సేన‌లోకి వెళ్లి రాంగ్ స్టెప్ వేశారు. ఇక ఇప్పుడు న‌రేంద్ర ఓడిపోవ‌డంతో రాజ‌కీయంగా ఆయ‌న కెరీర్ డైల‌మాలో ప‌డిపోయింది. ఆయ‌న కెరీర్‌లో ఒక్క‌సారి అయినా మంత్రి అవ్వాల‌న్న కోరిక తీర‌కుండానే ఆయ‌న ఎమ్మెల్యేగా ఓడిపోయారు.


జ‌గ‌న్ ఎన్నిక‌ల‌కు ముందు ఇచ్చిన ఆఫ‌ర్ తీసుకుని వైసీపీలోకి వెళ్లినా ఇప్పుడు మంత్రి అయ్యేవాడిన‌ని న‌రేంద్ర త‌న స‌న్నిహితుల ద‌గ్గ‌ర వాపోతున్న‌ట్టు తెలిసింది. ఇక వ‌చ్చే ఐదేళ్ల త‌ర్వాత రాజ‌కీయ ప‌రిస్థితులు ఎలా ఉంటాయో ?  న‌రేంద్ర భ‌విష్య‌త్తు ఎలా ఉంటుందో ?  అప్పుడు వైసీపీ మ‌రింత పుంజుకుంటే ప‌రిస్థితి ఏంట‌న్న‌ది ? అంచ‌నాకు రాలేం. ఏదేమైనా న‌రేంద్ర ఇప్పుడు తాను రాంగ్ స్టెప్ వేసిన‌ట్టు బాధ‌ప‌డుతున్నాడ‌ట‌. 


మరింత సమాచారం తెలుసుకోండి: