అమరావతిలో సాగుతున్న బాబుగారి ఓదార్పు యాత్రలు కామెడీగా సాగుతున్నాయి. చంద్రబాబుపై ప్రజల్లో ఇంకా అభిమానం ఉంది..కేవలం ట్యాంపరింగ్ వల్లే వైసీపీ గెలిచింది..కానీ ఇప్పటికీ చంద్రబాబే సీఎంగా ఉండాలని ప్రజలు కోరుకుంటున్నారంటూ..టీడీపీ నేతలు(బాబుగారి అలా ఆర్డర్ వేశారులెండి ) ఉండవల్లి బాబుగారి నివాసంలో ఓదార్పు యాత్రలు మొదలుపెట్టారు. రోజూ రాష్ట్రంలోని జిల్లాల నుంచి రైతులను, మహిళలను, చిన్నపిల్లలను, యువకులను ఉండవల్లి బాబుగారి ఇంటికి తరలించి..రోజంతా ఓదార్పు యాత్ర కొనసాగిస్తారు..గత 15 రోజులుగా రోజూ జనాలు రావడం..బాబుగారిని పట్టుకుని రాష్ట్రం కోసం మనవడితో కూడా ఆడుకోకుండా పని చేశావు..మాకు ఇంత చేశావు..నువ్వు ఓడిపోవడం ఏంటయ్యా అని కన్నీళ్లు కార్చడం..అప్పుడు బాబుగారు మనకు మంచి రోజులు వస్తాయి..అంటూ వాళ్ల వీపు పట్టుకుని నిమరడం..ఇలా కామెడీగా సాగుతున్నాయి ఈ ఓదార్పు యాత్రలు.


 
ఇక బాబుగారిని ఓదార్చడానికి ఈ ఈ జిల్లాల నుంచి..ఇంత మంది జనాలు వచ్చారు అంటూ వారి ఫోటోలను ఫేస్‌బుక్‌లో పెట్టి..చూశారా..ఇప్పటికీ జనాలు బాబుగారినే సీఎంగా కోరుకుంటున్నారు అంటూ పోస్టులు పెట్టి బిల్డప్ ఇవ్వడం తెలుగుదేశం సోషల్ మీడియా వింగ్ పని. మొన్నటికి మొన్న తన అమ్మానాన్నలతో వచ్చిన నాలుగేళ్ల భానుకిరణ్ అనే బుడతడు..20 ఏళ్ల తర్వాత రాష్ట్రం నెంబర్‌వన్‌గా ఉండాలి...అప్పడు కూడా చంద్రబాబు తాతే సీఎంగా ఉండాలని అన్నాడంటూ పోస్ట్ పెట్టిన టీడీపీ సోషల్ మీడియా వింగ్‌‌ చేసిన కామెడీ అంతా ఇంతా కాదు. 


తాజాగా జూన్ 11న  మంగళవారం నాడు టీడీపీ సోషల్ మీడియా వింగ్ పెట్టిన పోస్ట్ బాబుగారి ఓదార్పు యాత్రల్లో కామెడీకి పరాకాష్ట అనే చెప్పాలి. నిన్న ప్రకాశం, విజయనగరం, కృష్ణా, గుంటూరు జిల్లాల నుంచి తెదేపా కార్యకర్తలు, ప్రజలు మంగళవారం చంద్రబాబు నివాసానికి తరలివచ్చారు.ఈ పోస్టులో ఫోటోలు చూస్తే వచ్చిన వాళ్లంతా ఏదో పిక్నిక్‌ వచ్చినట్లు చక్కగా ముస్తాబై , బాబుగారితో సెల్ఫీలు దిగి, ఆయన చేతిలో పనిపిల్లలను పెట్టి ఆనందిస్తున్నట్లు కనిపిస్తుంది కానీ బాబుగారు ఓడిపోయినందుకు ఎవరూ బాధపడుతున్నట్లు కనిపించదు. 

కానీ  రైతు రుణమాఫీ 4, 5 విడతల సొమ్ము ఆగిపోవడం, అన్నదాత సుఖీభవ రద్దు విషయాలపై పేద రైతులు తమ ఆందోళనను వ్యక్తం చేశారు. ఈ ఖరీఫ్ లో పెట్టుబడులు ఎక్కడి నుంచి తేవాలో అర్థం కావట్లేదంటూ ఆవేదన చెందారు అంటూ టీడీపీ సోషల్ మీడియా వింగ్ ఫేస్‌బుక్‌లో పెట్టిన పోస్టు ఇప్పుడు నవ్వుల పాలవుతుంది.  ఏదో కొందరు పెద్ద వయసు ఉన్న వాళ్లనో, లేదా టీడీపీ పార్టీకి చెందిన రైతులను కిరాయి డబ్బులిచ్చి పట్టుకొచ్చి, బాబుగారి మీద పడి ఏడిపించి సెంటిమెంటల్ సీన్లు పండించడం కాదు..అసలు గ్రామాల్లో వెళ్లి చూస్తే...సీఎం జగన్ రైతు సంక్షేమ నిర్ణయాలతో రైతన్నలు ఎంత హ్యాపీగా ఉన్నారో తెలుస్తుందంటూ నెట్‌జన్లు కౌంటర్లు వేస్తున్నారు.


 సీఎం జగన్ ఈ రబీ నుంచి రైతు భరోసా పథకం కింద ప్రతి ఏటా ఒక రైతన్నకు రూ. 12,500 ఆర్థిక సాయం అందిస్తామని ప్రకటించాడు. అదీ ఈ ఖరీఫ్‌కు పెద్దగా సమయం లేదు కనుక..58 లక్షల మంది రైతులకు అందజేయడానికి కావల్సిన పథకం విధివిధానాలు,  అమలు చేయడానికి సమయం పెద్దగా లేకపోవడంతో ఈ ఏడాదిన వచ్చే రబీ నుంచి రైతు భరోసా పథకం అమలు చేస్తానని ప్రకటించాడు. అంతే కాదు రైతుల అప్పులతోపాటు  వడ్డీలన్నీ ప్రభుత్వమే తీరుస్తుందని చెప్పాడు.  రైతుల అప్పులకు సంబంధించిన మొత్తం బ్యాంకుల ప్రభుత్వమే చెల్లిస్తుందని చెప్పాడు. అంతే కాదు రైతులందరికీ వడ్డీలేని రుణాలు ఇస్తామని చెప్పాడు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా రైతన్నలు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు.

ఇది నిజమైన రైతు ప్రభుత్వం అని రైతన్నలు జగన్ సర్కార్‌ను ప్రశంసిస్తున్నారు. ఈ నేపథ్యంలో చంద్రబాబును రైతన్నలు ఇంకా మర్చిపోవడం లేదని, బాబు దగ్గరకు వచ్చి ఈ ఖరీఫ్‌కు డబ్బులెట్లయ్యా అంటూ ఆయన్ని కౌగిలించుకుని ఏడుస్తున్నారంటూ ఇవాళ ఏబీఎన్ ఆంధ‌్రజ్యోతి పత్రిక ఓ కథనం ప్రచురించి సెంటిమెంట్‌ను కుమ్మరించింది.. ఇలా బాబుగారి ఓదార్పు యాత్రలను భుజాన వేసుకున్న రాధాకృష్ణ గత పది రోజులుగా రోజుకో కథనంతో కామెడీ పండిస్తూనే ఉన్నాడు. చంద్రబాబు, తెలుగుతమ్మళ్ల ఓవరాక్షన్, ఏబీఎన్ రాధాకృష్ణ సెంటిమెంటల్ కథనాలు చూసి తట్టుకోలేకపోయిన నెట్‌జన్లు  ఓరినాయనో ఆపండ్రోయ్..ఇక ఆపండ్రోయ్..బాబుగారి కామెడీ యాత్రలు అంటూ..ఫుల్లుగా సెటైర్లు వేస్తున్నారు.

అయినా క్షేత్రస్థాయిలో పరిస్థితిని గమనించకుండా...మా చంద్రబాబు తోపు, జనాలంతా టీడీపీ వెంటే ఉన్నారంటూ..బాబుగారిని పక్కదోవ పట్టించిన ఏబీఎన్ రాధాకృష్ణ ఇకనైనా బాబుగారి ఓదార్పు యాత్రలను ఆపండి అంటూ కొత్త పలుకు పలికితే బాగుంటుంది..లేకుంటే జీవితాంతం చంద్రబాబు నేను తోపు, నేను నిప్పు అనుకుంటూ..ఇలా భ్రమలోనే ఉండిపోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. మొత్తంగా ఉండవల్లిలో కొనసాగుతున్న బాబుగారి కామెడీ యాత్రలకు ముగింపు ఎప్పుడు వస్తుందో చూడాలి..అప్పటిదాకా బాబుగారి ఓదార్పు యాత్రలపై ఏబీఎన్ రాధాకృష్ణ  ప్రచురించే చిత్ర విచిత్ర కథనాలు  భరించక తప్పదు మరి.


మరింత సమాచారం తెలుసుకోండి: