నవ్యాంధ్రప్రదేశ్ రెండవ శాసనసభ స్పీకర్గా వైసీపీ ఎమ్మెల్యే తమ్మినేని సీతారాం ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.  స్పీకర్ ఎన్నిక కు  నామినేషన్ గడువు పూర్తయ్యే సమయానికి  తమ్మినేని సీతారాం ఒకరే నామినేషన్  వేశారు.  దీంతో అసెంబ్లీ స్పీకర్గా సీతారాం  ఎంపిక ఏకగ్రీవం అయ్యింది.

 

స్పీకర్గా తమ్మినేని సీతారాం  అభ్యర్థిత్వాన్ని బలపరుస్తూ 30 మంది వైసీపీ ఎమ్మెల్యేలు మద్దతు తెలిపారు.  వైసిపి  అధ్యక్షుడు  జగన్ స్పీకర్గా తమ్మినేని  అభ్యర్థిత్వాన్ని ప్రతిపాదించారు.  ప్రొటెం స్పీకర్  అప్పలనాయుడు ఉదయం స్పీకర్ ఎన్నిక కు సంబంధించి అసెంబ్లీలో  ప్రకటన చేశారు.

 

  తమ్మినేని సీతారాం  శ్రీకాకుళం జిల్లా కు చెందిన నేత.  ఆయన ఐదు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.  గతంలో  మంత్రి గాను పని చేశారు.  ప్రస్తుతం  ఆముదాలవలస నియోజకవర్గం నుంచి  ప్రాతినిధ్యం వహిస్తున్నారు.

 

తమ్మినేని సీతారాం అనుభవాన్ని దృష్టిలో ఉంచుకొని జగన్ ఆయనను ఈ పదవికి చేశారు.  ప్రజాస్వామ్యంలో ముఖ్యమంత్రి ,  ప్రతిపక్ష నేత తర్వాత అత్యధిక ప్రాధాన్యం ఉన్న పదవి అసెంబ్లీ స్పీకర్.  శాసన సభా గౌరవాన్ని పెంచేలా స్పీకర్గా బాధ్యతలు  నిర్వహిస్తానని తమ్మినేని సీతారాం తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: