జగన్మోహన్ రెడ్డి రోజు రోజుకు ఓ పథకంతో జనాల ముందుకొస్తున్నారు. తొందరలో ‘ప్రజాదర్బార్’  నిర్వహించాలని డిసైడ్ అయ్యారు. జనాలతో మాట్లాడటం ద్వారా వాళ్ళ సమస్యలను ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకే జగన్ ప్రజాదర్బార్ ఏర్పాటు చేయనున్నారు.

 

పాదయాత్ర సమయంలో అధికారంలొకి వస్తే జనాలతో నేరుగా ముఖాముఖి ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చారు. ఆ హామీలో భాగంగానే తొందరలో ప్రజాదర్బార్ మొదలవుతోంది. ప్రతీరోజు ఉదయం 8-8.30 గంటల మధ్య జనాలతో నేరుగా మాట్లాడాలని జగన్ నిర్ణయించుకున్నారు. ఈ కార్యక్రమం ద్వారా ప్రజలకు మరింత చేరువయ్యేందుకు అవకాశం ఉంటుంది.

 

ఇదే పద్దతిలో గతంలో వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్నపుడు కూడా మామూలు జనాలను కలుసుకునేవారు. సామాన్య జనాలను కలుసుకునే సమయంలో వివిఐపిలు, ప్రజా ప్రతినిధులను కలుసుకునేందుకు ఇష్టపడే వారు కాదు. అదే పద్దతిలో జగన్ కూడా మామూలు జనాలను కలుసుకునే సమయంలో ప్రజా ప్రతినిధులెవరినీ కలవకూడదని అనుకుంటున్నారట.  ప్రజల సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించటం లేకపోతే సంబంధిత ఉన్నతాధికారులకు పంపి పరిష్కారం చేయించటమే ప్రజాదర్బార్ ఉద్దేశ్యం.

 

 

 

 

 

 


మరింత సమాచారం తెలుసుకోండి: