అధికారంలో ఉన్న అయిదేళ్ళు ...పద్మవ్యూహం లో చిక్కుకున్నారు చంద్రబాబు...ప్రత్యర్దులు ఆయన తో పులి జూదమాడారు...నవ్యాంధ్ర సారధిగా బాధ్యత లు స్వీకరించిన వెంటనే రెవెన్యూ లోటు... కరువు.. తుఫానులు..అస్తవ్యస్త పరిస్దితులు...అమరావతి కి తరలి వచ్చి పాలన సాగించినా...రాజధాని భావోద్వేగాన్ని...ప్రత్యర్దులు విమర్శల ద్వారా పలుచన చేసారు..


ఆయన చిత్తశుద్ది తో "మన రాష్ట్రం, మనరాజధాని" అని పని చేసినా, పారిపోయి కేసీఆర్ కి భయపడి వచ్చాడన్న ప్రచారం చేసారు...పట్టిసీమ క్రెడిట్ ని అవినీతి  ఆరోపణల తో పలుచన చేసారు...బీటలు వారిన భూములకు నీరు తెచ్చిన చంద్రబాబు ని కాదనుకున్నారంటే...ప్రత్యర్దులు చేసిన దుష్ప్రచారం ప్రజల్లోకి బాగా వెళ్ళినట్టే!పుష్కరాలు నిర్వహించినా...కంపెనీల కోసం దేశాలు తిరిగినా...దుబారా అన్నారు...ఈ రకంగా చేసిన మంచికి మసి పూసారు...ఈ లోగా మోదీ తో చెడటం...గవర్నర్ కేసీఆర్ లతో ఎడం జరగటం...పవన్ కళ్యాణ్ సరియైన సమయంలో తీవ్ర విమర్శలు చేయటం...జగన్ విమర్శిస్తే కంటే పవన్ విమర్శిస్తే బలమైన ప్రభావం చూపుతుందని భావించారు, అందుకే 
ఆయన చేత చేయించారు...


ప్రత్యేక హోదా రాదు , లేదు , ఇవ్వటం కుదరదని చెప్పి పేకేజి కి ఒప్పించారు...జగన్ చేత ఉద్యమం చేయించారు...తప్పని సరిగా కేంద్రం తో దూరం జరిగేలా చేసారు..కాపుల రిజర్వేషన్ విషయంలో కూడా... ముద్రగడ లాంటి వారిచేత ఉద్యమం చేయించి చంద్రబాబు ని ఇరుకున పెట్టారు..కాపుల కు కోపం రాకూడదని ...రైళ్ళు తగలపెట్డినా...పోలీస్ స్టేషన్ల ముందు ముద్రగడ అనుచరుల ఆగడాలు భరించారు...కఠినమైన చర్యలు తీసుకోలేక పోయారు..కచ్చితంగా మిగతా సామాజిక వర్గాల కు ఆగ్రహం కలుగుతుంది...


కాపుల మీద కంటే చంద్రబాబు మీదే కోపం ఉండటం సహజం...కాపుల పట్ల చంద్రబాబు వైఖరి  కాపులకు సంతృప్తి పరచలేదు. సరికదా, బీసీల్లో ఆలోచన మొదలయింది...జగన్ చేత కాపులకి రిజర్వేషన్ హామీ ఇవ్వలేమని చెప్పించారు..అప్పుడు జనాభా లో సగం ఉన్న బీసీలు జగన్ వైపు చూడటం మొదలు పెట్టారు..అలాగే ఎన్నికలప్పుడు...సంప్రదాయం గా ఇతర కులాలకిచ్చే సీట్లు.. బీసీలకిచ్చి వారి నమ్మకాన్ని పొందారు జగన్... ఉదా.. రాజమండ్రి పార్లమెంట్,  మండపేట్ అసెంబ్లీ...
అక్కడి జయాపజయాలు ఎలా ఉన్నా, ఒక సంకేతం బీసీల్లో కి బలంగా వెళ్ళింది..ఇక్కడ అసలైన ఇంకొక ట్వస్ట్ -  పవన్ జగన్ కి వ్యతిరేకంగా పనిచేయలేదు...


రాజ్ భవన్ సాక్షిగా, వారి సూచనతోనే విడిగా పోటీ చేసారు...జగన్ పై కాపుల కున్న కోపంతో  వారు చంద్రబాబు వైపు మళ్ళ కుండా పవన్ ని దించారు..జగన్ ని మాత్రమే విమర్శిస్తాడు..చంద్రబాబు ని ఏమీ అనడు...దాంతో ఇద్దరు ఒకటే అని ప్రచారం వేరే!అప్పుడు .. బీసీలు కొద్దో గొప్పో టీడీపీ వైపు ఉన్న వారు కూడా జగన్ వైపు మళ్ళుతారు..పవన్ అంటేనే నచ్చని కాపులు ఎవరైనా ఉంటే, వారికి చంద్రబాబు అసలు నచ్చడు...వాళ్ళు జగన్ వైపు చూసారు..
ఇంకో ముఖ్య సామాజిక వర్గాలు...బ్రాహ్మణ ..క్షత్రియ..క్షత్రియుల్ని కేసీఆర్ ద్వారా...బ్రాహ్మణులు ని  స్వామీజీలు, రమణ దీక్షితులు  ఇలాంటి వారి తో పోలరైజ్ చేయగలిగారు..
ఇంకా చిన్నా చితక ఎవరైనా మిగిలితే.."కమ్మ వాళ్ళను" బూచిగా చూపి... కమ్మ వ్యతిరేకత కలిగించి.. జగన్ కి అనుకూలంగా సమీకృతం చేయగలిగారు...పీకే...అమిత్ షా ల వ్యూహాలు...సోషల్ ఇంజనీరింగ్ ఇలాగే ఉంటుంది...
సోషల్ ఇంజనీరింగ్...కేంద్రం నిరాదరణ..కాపుల గోల...బిసీల కినుక ..వీటి మధ్య పద్మవ్యూహం లో చంద్రబాబు చిక్కుకున్నారు..


అలాగే... కేంద్రం తో సంబంధాల విషయంలో... హోదా విభజన హామీలు...నిధులు విడుదల..పక్క రాష్ట్రం తో కయ్యం...ఇలా ఊపిరి సలపనివ్వలేదు మోదీ, షా, నరసింహన్,  జగన్,  కెసీఆర్,  ఈడీ, ఈసీ...
అన్ని వైపులా దార్లు మూసుకుంటూ  ఒకవైపుకి నెట్టారు..


అదే కాంగ్రెస్ వైపు..తప్పక కాంగ్రెస్ తో కలవాల్సిన పరిస్థితి కల్పించారు...అది తెలుగుదేశం మూలసిద్దాంతాన్ని దెబ్బ కొట్టింది..కాంగ్రెస్ వైపుకి నెట్టి బయటకొచ్చే దారి మూసేసారు..
"పులి మేక ఆటలో దారి బందయితే ఆట ముగిసినట్టే"...వాళ్ళ వ్యూహాన్ని అనుకున్నదనుకున్నట్డు అమలు పరిచారు...
చంద్రబాబు ఆట కట్టించారు...


ఈ ఆటలో అన్ని మార్గాలు వాడారు...ఈసీ...సీబీఐ... ఈవియమ్...ఏదీ ఒదిలి పెట్టలేదు...వీటికి తోడు, జగన్ "ఒక్కసారి ఛాన్స్" రిక్వెస్ట్ కూడా పని చేసింది..ఈ ఓటమి ద్వారా గుణపాఠం నేర్చుకోీవాలి..ఇప్పటి కాలానికి తగిన వ్యూహాలతో ...చంద్రబాబు ముందుకెళతారని ఆశించవచ్చు..బీసీ వర్గాల నుండి యువ నాయకత్వాన్ని ప్రోత్సహించాలి..."బెల్లం కొట్టిన రాయి లాంటి యనమల" ను వదిలించుకుని...రామ్మోహన్ నాయుడు లాంటి వారికి పార్టీ బాధ్యత అప్పగించాలి.బీసీలకు పెద్ద పీట వేసి, ప్రాముఖ్యత ఇవ్వాలి..


చంద్రబాబు గారు ప్రశాంతంగా ఆలోచిస్తే, పార్టీ కి అంతా మంచి జరుగుతుంది.చిన్న నాటి స్నేహితులకు, ఈర్షా ద్వేషాలకు రాష్ట్రాన్ని ఎలా దెబ్బతీయవచ్చో నా ఆలోచనలు రాసాను.ఇంకోసారి ఎప్పుడు ఇలా రాజకీయ విషయాలు పోస్ట్ చేయని అని హామీ ఇస్తూ -  


బీసీలకు 15 వేలకోట్లు,
ఎస్సిలకి 10 వేలకోట్లు,
బ్రాహ్మణులకు 100 కోట్లు ,
కాపులకు 1000 కోట్లు,
మాట తప్పకుండా రిజర్వేషన్స్ ఇచ్చి,
ఉద్యోగులకు అడిగిన అన్ని కోర్కెలు తీర్చి,
రైతులకు 24 వేల కోట్లు రుణమాఫీ చేసి,
పట్టి సీమని 9 నెలలో కట్టి డెల్టాకు సాగునీరు,తాగు నీరు సకాలంలో అందించి,
పోలవరం దేశంలోనే అన్ని ప్రాజెక్టులు కంటే ముందుగా  70 శాతం ప్రాజెక్ట్ పూర్తి చేసి,
పైసా ప్రభుత్వానికి ఖర్చు లేకుండా పక్క రాష్ట్రాలు ఈర్ష పడేలా ఆర్థిక సంపదను సృష్టించే రాజధాని దేశంలోనే అతి వేగంగా నిర్మించి,
10 వేలకోట్లు డ్రాక్వా రుణాలు రద్దు చేసి,
10 లక్షల పేదల ఇళ్లను దేశంలో ఎవరూ నిర్మించనంత వేగంగా నాలుగేళ్ళల్లోనే నిర్మించి, 
4 లక్షల ఇళ్ల పట్టాలు విడిగా ఇచ్చి,
షుమారు 100 కు పైగా సాఫ్ట్ వేర్ సంస్థలు తెచ్చి,
గ్రామాల్లో 23 వేల కిలోమీటర్ల సిమెంట్ రోడ్లు వేసి,
8 వేల కిలో మీటర్లు పొలాలకు మెటల్ రోడ్లు వేసి,
లక్ష చెరువులు తవ్వించటం లేదా పూడిక తీయించటం చేసి,
750 పెద్ద, మధ్య, చిన్న తరహా పరిశ్రమలు తెచ్చి,
6 విమానాశ్రయాలు కట్టి,
4 నేషనల్ హైవెస్ కి కావలసిన భూములను అందించి కట్టించి,
రాయల సీమలో మొదటిసారిగా అత్యధికంగా సాగునీరు, తాగు నీరు అందించి,
బందరు ఓడరేవుకు కావలసిన వన్నీ సమకూర్చి,
పార్లమెంటులో బీజేపీ మంత్రి ప్రకటించిన లెక్కల ప్రకారమే ప్రత్యక్షంగా 2,60,000 వేల ఉద్యోగాలు ఇచ్చి,
శాంతి భద్రతలు కాపాడి,
రెండేళ్లలోనే సచివాలయం,
శాసనసభ తరలించి 30 వేల మంది ఉద్యోగులను తరలించి,
ఫీజు రీఎంబర్స్ మెంటు,
ఆరోగ్యశ్రీ,
ఫించన్లు,
చంద్రన్న భీమా, లాంటి 130 పధకాలు పెంచి కొనసాగిస్తూ,
అన్న కాంటిన్స్ తో 5 రూపాయలతో అన్నం పెట్టి,
దేశంలో ఎవరూ ఇవ్వనంత ముఖ్యమంత్రి రిలీఫ్ ఫండ్ 1500 కోట్లు ఇచ్చి,
"కీయా"లంటి సంస్థలు తెచ్చి,
ప్రతి జిల్లాను ఏదో ఒక అభివృద్ధి చేస్తూ,
పాలనలో సాంకేతికతను జోడిస్తూ దేశంలో అందరికి అందనంత దూరంలో ఎదిగి, 
ఎవరికి లేని విధంగా 732 కేంద్ర అంతర్జాతీయ పాలనా దక్షతలో అవార్డులు పొంది, 
రేయింబవళ్లు నిద్రాహారాలు మాని విజన్తో రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలని తపనతో కష్ట పడిన ఏకైక  ముఖ్యమంత్రి చంద్రబాబు.
రాష్ట్ర తలసరి ఆదాయం 2013-14 లో 80 వేలు ఉంటే, 
2017-18 కి Rs1,30,000/-వేలకు తీసుకెళ్లాడు.
దేశంలో ఏ ముఖ్యమంత్రి అయినా లోటు బడ్జెట్ లో, 
కేంద్రం అన్ని విధాలా రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తున్న దశలో,
అన్ని పార్టీలు సహకరించకుండా అభివృద్ధిని ఎన్ని విధాలుగా దెబ్బతీసే ప్రయత్నం చేసినా వీటినన్నిటిని ఎదుర్కొని ప్రజలకోసం "స్వకులానికి ఏమి చేయకపోయినా", 
అన్ని అవమానాలు, ఛీత్కారాలు భరిస్తూ సాధించాడు.


అయినా ప్రత్యర్థుల కుట్ర, కుతంత్రాలకు భయపడి ప్రజలకు దూరం అవుతామేమోనని ఎన్నికల ముందు ఇవ్వని తాయలం లేదు.అన్నీ పొంది, అన్నీ అనుభవించి,ఆర్థిక నేరస్తుల సమూహం మాటలే ప్రజలు నమ్మారు.కులాలు, మతాలు, ప్రాంతాలు రెచ్చగొట్టే దోపిడీ నాయకుల విధానాలే వారికి నచ్చాయి. అందుకే రాష్ట్రాన్ని ప్రపంచ పటంలో అత్యున్నత స్థానంలో నిలబెట్టే ఒక దార్శినికుడిని అత్యంత అవమానకరంగా ఓడించారు.
ఈర్షాద్వేషాలకు లొంగిపోయారు.


మరింత సమాచారం తెలుసుకోండి: