తినడానికి తిండిలేని దేశానికి అంతరిక్ష పరిశోదనలు ఎందుకు అని ఎద్దేవా చేసిన ఒకప్పటి పశ్చయత దేశాలు.ఇప్పుడు భారత్ మేధస్సుకు తలలు పట్టకుంటున్నాయి. ఆ భారత్ మేధస్సు ఆసియా లో తమ ఆధిపత్యాన్ని ఎక్కడ అడ్డుకుంటుందో అని చైనా.అలాగే తమ దేశంలో ఉన్న తీవ్రవాదులను మట్టుపెడుతుంది అని పాకిస్థాన్ కంటి మీద కునుకు లేని రాత్రులను గడుపుతున్నాయి.

శత్రుదేశాల ను మరింతగా కంగారు పెట్టేందుకు భారత్ డీ.అర్.డివో హైపర్ సోనిక్ టెక్నాలజీ డిమాన్స్ట్రాటర్ వెహికల్ ను విజయవంతంగా ప్రయోగించి మరో ఘనతను అందుకుంది.ఇందులో మిస్సైల్ ను అమర్చుకోవచ్చు అలాగే అతి తక్కువ ఖర్చుతో అంతరిక్షానికి ఉపగ్రహాలను పంపవచ్చు.

దీనితో అమెరికా,రష్యా,చైనా తర్వాత ఈ టెక్నాలజీ కలిగిన దేశంగా మారింది.అలాగే ఆ దేశాలు పెట్టిన ఖర్చు కంటే అతి తక్కువ ఖర్చుతో డీ.అర్.డివో ఈ టెక్నాలజీ ను భారత్ కు అందించింది.ఇప్పటికే భారత్ ఉపగ్రహ విధ్వంసక క్షిపణి పరిజ్ఞాన్ని సాధించడంతో అగ్రగామి దేశాల సరసున చేరింది.దానిని తట్టుకోలేక ఇబ్బంది పడుతున్న దాయాది దేశానికి ఈ విజయం మరింత కంగారు పెట్టనున్నది.


మరింత సమాచారం తెలుసుకోండి: