అవుననే అంటున్నాయి టిడిపి వర్గాలు కూడా.  కోడెల కుటుంబం పాపాలు బద్దలై పోలీసు స్టేషన్లో కేసులు నమోదవుతుండటంతో ముందు జాగ్రత్తగా భయంతో పరారైనట్లు జగన్ మీడియా చెబుతోంది. ఐదేళ్ళల్లో స్పీకర్ గా పనిచేసిన  కోడెల శివప్రసాద్ ను అడ్డం పెట్టుకుని కొడుకు కోడెల శివరామకృష్ణ, కూతురు విజయలక్ష్మి సాగించిన అరాచకాలు అంతా ఇంతా కాదు.

 

కొడుకు, కూతురు ఇద్దరిపైనా వివిధ పోలీసు స్టేషన్లలో ఇప్పటికి సుమారు 10 కేసులు నమోదయ్యాయి. కొడుకు సత్తెనపల్లి, కూతురు నరసరావుపేట నియోజకవర్గాలను తమ అడ్డాలుగా మార్చుకుని వాళ్ళు, వీళ్ళని లేకుండా అందరినీ నిలువు దోపిడి చేసేశారు. ఎదురుతిరిగిన వాళ్ళపై కేసులు పెట్టి జైళ్ళల్లోకి తోశారు.

 

సీన్ కట్ చేస్తే మొన్నటి ఎన్నికల్లో టిడిపి తో పాటు కోడెల శివప్రసాద్ కూడా ఓడిపోయారు. దాంతో వాళ్ళ పాపాల పుట్ట పగలుతోంది. అప్పటి బాధితులందరూ ఇపుడు ధైర్యంగా పోలీసు స్టేషన్లకు వెళ్ళి ఫిర్యాదులు చేస్తున్నారు.  అప్పట్లో బాధితులపైనే ఎదురు కేసులు పెట్టిన పోలీసులు ఇపుడు మాత్రం ఫిర్యాదు రాగానే కోడెల కొడుకు, కూతురుపై వెంటనే కేసులు పెట్టేస్తున్నారు. పార్టీ ఓడిపోతే తమ పరిస్ధితి ఏమిటనే ఆలోచన కూడా లేకుండా అందినకాడికి దోచేసుకోవటమే విచిత్రంగా ఉంది.

 

రోజు రోజుకు నమోదవుతున్న కేసులు పెరిగిపోతుండటంతో ఏ నిముషంలో అయినా వాళ్ళ అరెస్టు తప్పదనే ప్రచారం ఊపందుకుంది. దాంతో వాళ్ళిద్దరూ అజ్ఞాతంలోకి వెళ్ళిపోయినట్లు చెప్పుకుంటున్నారు. అసలు జిల్లా నుండి పరారైపోయారని ఎక్కడో దూరంగా దాక్కున్నట్లు బాహాటంగానే చెప్పుకుంటున్నారు. వాళ్ళిద్దరి కోసం పోలీసులు ఎన్నిసార్లు ఇళ్ళకు వెళ్ళినా లేరట. పోలీసులు ఫోన్ల ద్వారా కాంటాక్ట్ చేద్దామని ప్రయత్నిస్తే స్విచ్చాఫ్ అని సమాధానం వస్తోందట.

 

తాము అరెస్టు కాకుండా కోర్టులో  ముందస్తు బెయిల్ తీసుకునేందుకు వాళ్ళిద్దరూ ప్రయత్నాలు చేస్తున్నట్లు టిడిపి నేతలే చెప్పుకుంటున్నారట. అంటే ఇంకా ఎంతమంది బాధితులు వస్తారో ? ఎన్ని కేసులు నమోదవుతాయో ? చూడాల్సిందే.

 

 


మరింత సమాచారం తెలుసుకోండి: