ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రేపు ఢిల్లీ వెళ్లనున్నారు.  ఆయన రెండు రోజుల పాటు ఢిల్లీలో   ఉంటారు.   పార్లమెంటు సమావేశాలు ప్రారంభం కానున్న తరుణంలో ఢిల్లీ పర్యటన కీలకమైంది. 

 

మొదటిరోజు జగన్మోహన్ రెడ్డి బిజెపి అధ్యక్షుడు అమిత్ షా తో భేటీ అవుతారు. తాజా  రాజకీయాల పై చర్చిస్తారు. పార్లమెంటు సమావేశాలు  ప్రారంభం అవుతున్న సమయంలో   అమిత్ షా జగన్ మద్దతు కోరే అవకాశం ఉంటుంది. 

 

పార్లమెంట్ సమావేశాల్లో  వైసిపి అనుసరించాల్సిన వ్యూహాలపై జగన్ తన పార్టీ   ఎంపీ లకు దిశా నిర్దేశం చేస్తారు.  ప్రస్తుతానికి వైసిపి బిజెపి అనుకూల వైఖరిని ప్రదర్శించే అవకాశం ఉంది.  తద్వారా రాష్ట్రానికి రావాల్సిన నిధులు రప్పించుకునే వెసులుబాటు కలుగుతుంది.

 

ఇక 15వ తారీకు జగన్ నీతి ఆయోగ్ సమావేశంలో పాల్గొంటారు.  ఈ సమావేశంలో అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు పాల్గొంటారు.  ఏపీ ముఖ్యమంత్రి హోదాలో జగన్ నీతి ఆయోగ్ సమావేశానికి వెళ్లడం ఇదే మొదటిసారి.  ఎజెండాలో  లేకపోయినా జగన్ ఢిల్లీలో పలువురు కీలక నేతలను కలుసుకునే అవకాశం ఉండొచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: