రాజధాని ప్రాంతమైన సిఆర్డీఏ కి ఛైర్మన్ గా ఆళ్ళ రామకృష్ణారెడ్డిని జగన్మోహన్ రెడ్డి నియమించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. అదే గనుక నిజమైతే చంద్రబాబునాయుడుకు సరైన మొగుడును జగన్ రంగంలోకి దింపినట్లే భావించాలి.  ఎందుకంటే ఇన్ సైడ్ ట్రేడింగ్ ముసుగులో చంద్రబాబు అండ్ కో వేల కోట్ల రూపాయల భూ కుంభకోణానికి పాల్పడ్డారని జగన్ ఎన్నోసార్లు ఆరోపించారు. అదంతా బయటకు రావాలంటే ఆళ్ళే సరైన వ్యక్తి.

 

ఎందుకంటే రాజధాని ప్రాంతంలో చంద్రబాబు చేసిన బలవంతపు భూ సేకరణకు వ్యతిరేకంగా పోరాటం చేసిన వాళ్ళెవరైనా ఉన్నారంటే అది ఆళ్ళ  మాత్రమే. ఇక్కడే చంద్రబాబు అండ్ కో వేల కోట్ల రూపాయల కుంభకోణాలకు పాల్పడినట్లు ఆరోపణలు అందరికీ తెలిసిందే.

 

అంతర్జాతీయ రాజధాని అంటూ చంద్రబాబు ఐదేళ్ళు ఒకటే ఊదరగొట్టిన విషయం తెలిసిందే. రాజధాని నిర్మాణం పేరుతో  చంద్రబాబు వేల రైతుల నోళ్ళు కొట్టి సుమారు 40 వేల ఎకరాలు సేకరించారు. ఇందులో ఇష్టపూర్వకంగా భూములిచ్చిన రైతులు కొంతమందే. మిగిలిన రైతుల భూములను చంద్రబాబు ప్రభుత్వం బలవంతంగా లాగేసుకుంది.

 

ఇక్కడే ఆళ్ళ సీన్ లోకి ఎంటరయ్యారు. బలవంతపు భూ సేకరణకు వ్యతిరేకంగా రైతుల తరపున ఆళ్ళ కోర్టుల్లో కేసులు వేశారు.  బలవంతపు భూ సేకరణను నిలిపేయాల్సిందిగా కోర్టు స్టేలు కూడా ఇచ్చింది. దాంతోనే చంద్రబాబు బలవంతపు భూ సేకరణకు బ్రేకులు పడ్డాయి.

 

అంతే కాకుండా మంగళగిరిలోని వందల కోట్ల రూపాయల విలువైన సదావర్తి సత్రం భూములను కారు చౌకగా కొట్టేయటానికి చంద్రబాబు వేసిన ప్లాన్ ను కూడా ఆళ్ళే అడ్డుకున్నారు. ఓటుకు నోటు కేసులో కూడా చంద్రబాబును సుప్రింకోర్టుకు లాగింది ఆళ్ళే అన్న విషయం కొత్తగా చెప్పక్కర్లేదు.

 

ఐదేళ్ళ పాలనలో చంద్రబాబుకు  నిర్ణయాలకు వ్యతిరేకంగా వివిధ కోర్టుల్లో ఆళ్ళ సుమారుగా 40 కేసులు దాకా వేసుంటారు. అందులో కొన్ని గెలవగా మరికొన్ని కేసుల్లో కోర్టులో స్టేలు ఇచ్చాయి.  మొత్తం మీద ఐదేళ్ళల్లో చంద్రబాబును న్యాయస్ధానాల్లో కేసులు వేసి ముప్పు తిప్పలు పెట్టిన ఆళ్ళకే జగన్ సిఆర్డీఏ ఛైర్మన్ ఇవ్వాలని నిర్ణయించటమంటే చంద్రబాబుకు ఇబ్బందే.

 


మరింత సమాచారం తెలుసుకోండి: