ప్రత్యేక విమానాలు, ప్రత్యేక ఏసీ రైళ్ళలో పచ్చ బ్యాచ్ అందరినీ ఢిల్లీకి తీసుకెళ్ళి 5 స్టార్ దీక్ష చేసి, ఒక్కరోజే 25 కోట్లు ప్రజల డబ్బు నాకేసిన నువ్వు ఓడిపోవడం ఏంటయ్యా....??  ప్రపంచ చరిత్రలో లేనివిధంగా అధికారంలో ఉండి దీక్షలు చేయడమే కాకుండా, అందుకు ఖర్చుల రూపంలో 500 కోట్లు నాకేసిన నువ్వు ఓడిపోవడం ఏంటయ్యా....


"ఇసుక ఉచితం.." అంటూ పైకి చెప్పి లోన మన పచ్చ బ్యాచ్‌కు "లారీ ఇసుకకు 15,000/- L tax గుంజండి.." అన్న నువ్వు ఓడిపోవడం ఏంటయ్యా..
దేశంలో ఇంతవరకు కనీసం రాష్ట్రపతి కూడా ఉపయోగించని లీటరు 650/- హిమాలయన్ వాటర్‌తో సమీక్షలు నిర్వహించే నువ్వు ఓడిపోవడం ఏంటయ్యా..
2014లోనే కేంద్రం 28,000 కోట్లతో Anantapur-Amaravati Express Way ను మంజూరుచేసినా, మిగతా జిల్లాలు అభివృద్ధి చెందకుండా కేవలం మన రెండు జిల్లాలే అభివృద్ధి చెంది, మన బినామీ రియల్ ఎస్టేట్ భూములకు విలువ రావాలని, అనంతపురం-అమరావతి ఎక్స్‌ప్రెస్‌వేను పట్టించుకోని నువ్వు ఓడిపోవడం ఏంటయ్యా..


నీటిబొట్టు గానీ, నీడనిచ్చే చెట్టు గానీ లేకుండా "నీరు_చెట్టూ" అంటూ ఐదేళ్ళలో 18,061 కోట్లు కొల్లగొట్టిన నువ్వు ఓడిపోవడం ఏంటయ్యా..23 కేంద్ర పథకాలకు చరిత్రలో ఏ సిఎం పెట్టుకోని విధంగా తన స్వంత పేరు పెట్టుకున్న మీరు ఓడిపోవడం ఏంటయ్యా..పెట్టుబడి లేని వ్యవసాయం (ZBNF) అంటూ ఈ 5 ఏళ్ళలో హడావుడి చేసి దానికి ఏకంగా 250 కోట్లు ఖర్చు చూపించిన నువ్వు ఓడిపోవడం ఏంటయ్యా..


రెయిన్‌గన్ స్ప్రింక్లర్లతో ఇక ఆంధ్రప్రదేశ్ సస్యశ్యామలం అంటూ దానికి ఒక్కరోజులో 100 కోట్లు నాకేసిన నువ్వు ఓడిపోవడం ఏంటయ్యా..బెజవాడలో ఎయిర్‌షో అంటూ ఒక్కరోజే 450 కోట్లు నాకేసిన నువ్వు ఓడిపోవడం ఏంటయ్యా..5 కోట్లతో ప్రత్యేక బస్సు కొనితెచ్చి 5 ఏళ్ళలో 5 సార్లు కూడా ఎక్కని నువ్వు ఓడిపోవడం ఏంటయ్యా..హైదరాబాద్‌లో నిమ్స్ మాదిరి మీరు బెజవాడలో ఒక మంచి సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి కట్టుకోండి అని కేంద్రం 2014లోనే 150 కోట్లు పంపితే, అది పూర్తయితే బెజవాడ, గుంటూరుల్లోని మన పచ్చవర్గ ఆసుపత్రులకు ఆదాయం తగ్గుతుందని, 5 ఏళ్ళు అయినా ఆ ఆసుపత్రిని పూర్తి చేయని నువ్వు ఓడిపోవడం ఏంటయ్యా..


కేంద్ర నిధులతో నిర్మించే జాతీయ ప్రాజెక్టు అయిన పోలవరాన్ని రాష్ట్రంలోని మన పచ్చవర్గానికంతా చూపించుటకని ఏకంగా 500 కోట్లు నాకేసిన నువ్వు ఓడిపోవడం ఏంటయ్యా..హైదరాబాదు అమరావతి మధ్య తిరగడానికి 150 కోట్లు, ఢిల్లీలోని కేడీవాలా, రాహువును కలవడానికి, బెంగాల్‌లోని మమతా బేగంను కలవడానికికని, సింగపూర్ మలేషియా మారిషస్ దావోస్ వగైరాలకని 500 కోట్లు, మొత్తం 650 కోట్లు కేవలం ప్రత్యేక విమానాలకే ఖర్చు చూపిన నువ్వు ఓడిపోవడం ఏంటయ్యా..జర్మనీ సైకిల్ అని ఒక్కో సైకిల్ 2 లక్షలకు కొనితెచ్చి అవి తుప్పుపట్టిపోయేలా చేసిన నువ్వు ఓడిపోవడం ఏంటయ్యా..
అమరావతిలో మహిళా పారిశ్రామికవేత్తల సదస్సు అంటూ ఒక్క రోజే 25 కోట్లు నాకేసిన నువ్వు ఓడిపోవడం ఏంటయ్యా.. సమీక్షల్లో స్నాక్స్ పేరుతో బాదం పిస్తా గింజలకు 18 లక్షలు నాకేసిన నువ్వు ఓడిపోవడం ఏంటయ్యా..


మరింత సమాచారం తెలుసుకోండి: