అదృష్టవంతుడిని ఎవరు ఆపలేరు... దురదృష్టవంతుడిని ఎవరు బాగు చేయలేరు అన్న నానుడి కాకినాడ కు చెందిన చలమలశెట్టి సునీల్‌కు ఖ‌చ్చితంగా సరిపోతుంది. సునీల్ రాజకీయాల్లోకి వచ్చాక అత‌డిని  ప్రతి ఎన్నికల్లోనూ కష్టం వెంటాడుతూనే ఉంది. పార్టీలు మారి తన అదృష్టాన్ని పరీక్షించుకున్నా గెలుపు మాత్రం గడప సునీల్ గ‌డ‌ప తొక్క లేదు. ఎన్ఆర్ఐగా ఉన్న చలమలశెట్టి సునీల్ 2009లో చిరంజీవి పిలుపుతో ప్రజారాజ్యం పార్టీలో చేరి కాకినాడ నుంచి లోక్‌భకు పోటీ చేశారు. సునీల్ భారీగా డబ్బులు వెదజల్లి ప్రజల్లోకి దూసుకువెళ్లారు. కాకినాడ లోక్‌స‌భ సీటుకు 2009లో జరిగిన ఎన్నిక‌ల్లో మాజీ కేంద్ర మంత్రి పళ్ళం రాజు చేతిలో సునీల్ స్వల్ప తేడాతో ఓడిపోయారు. అయితే సునీల్ కు ఆ ఎన్నిక‌ల్లో రెండో ప్లేస్ దక్కింది.


వైసీపీలోకి జంప్ చేసిన సునీల్ 2014 ఎన్నికల్లో మరోసారి కాకినాడ నుంచి లోక్ సభకు తన‌ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. ఆ ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీ చేసిన మాజీ మంత్రి తోట నరసింహం చేతిలో కేవలం 2 వేల ఓట్ల స్వల్ప తేడాతో ఓడిపోయారు. ఎంపీగా పోటీ చేసిన సునీల్ 2 వేల ఓట్ల తేడాతో ఓడిపోవడం అంటే చాలా దుర‌దృష్టం అని చెప్పాలి. ఆ తర్వాత సునీల్ వైసీపీలో ఉండి ఉంటే ఈ ఎన్నికల్లో జగన్ ఆయనకు కచ్చితంగా కాకినాడ ఎంపీ సీటు వచ్చేవారు..ఆయ‌న గెలిచి ఎంపీ అయ్యేవారు. జిల్లా వైసీపీ నాయకులతో ఏర్పడిన అభిప్రాయ భేదాల వల్ల సునీల్ ఎన్నిక‌ల‌కు ముందు పార్టీలో అంటీముట్ట‌న‌ట్టు ఉన్నారు.


జగన్ పార్టీలో ఉండమని చెప్పినా వినకుండా ఎన్నికలకు కొద్ది రోజుల ముందు టిడిపిలో చేరారు. ఈ ఎన్నికల్లో వైసీపీ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసిన వంగా గీత చేతిలో 23 వేల ఓట్ల తేడాతో సునీల్ ముచ్చటగా మూడోసారి ఓడిపోయారు. మూడు పార్టీల నుంచి మూడు సార్లు పోటీ చేసినా సునీల్ ఒక్కసారి కూడా విజయం సాధించలేదు. విచిత్రమేమిటంటే రాజకీయాల్లో ఫేడ్ అవుట్‌ అయిన గీత‌ చివరి క్షణంలో జగన్ ద‌య‌తో సీటు ద‌క్కించుకుని అనూహ్యంగా ఎంపీగా విజయం సాధించారు.


15 ఏళ్ళ పాటు జిల్లా రాజకీయాల్లో క్రియాశీలకంగా సునీల్ ఉన్నా.. ఆయ‌న వేసిన రాంగ్ స్టెప్పులతో మూడోసారి కూడా స్వల్ప తేడాతో ఓడిపోయారు. ఈ ఓట‌మి త‌ర్వాత‌ సునీల్ తనకు బాగా కావలసిన వారే వెన్నుపోటు పొడవడంతో మూడోసారి కూడా ఎంపీగా ఓడిపోయిందని సన్నిహితుల వద్ద ఆవేదన వ్యక్తం చేసినట్లు తెలుస్తుంది. రాజకీయాలపై పూర్తిగా వైరాగ్యం పెట్టుకున్న ఆయన ఇక వచ్చే ఎన్నికల్లో పోటీ చేసే ఉద్దేశంలో కూడా లేర‌ని సమాచారం.


మరింత సమాచారం తెలుసుకోండి: