ఇటు జగన్, అటు చంద్రబాబు. ఏపీలో రాజకీయం ఏం జరుగుతుంది. కొత్తగా అధికారంలోకి వచ్చిన వైసీపీ ఓ వైపు ఉంది. అన్నీ కోల్పోయి దైన్యావస్థలో  టీడీపీ ఉంది. ఇపుడు ఏపీలో రాజకీయమంతా వైసీపీ చుట్టూనే తిరుగుతోంది.  సీన్ చూస్తూంటే పెను సంచలనాలే నమోదు అయ్యేట్టు కనిపిస్తోంది.



వైసీపీలోకి రావాలనుకుంటే రాజీనామా చేయాలి. ఇది జగన్ కచ్చితమైన కండిషన్. అయితే దీనికి కూడా టీడీపీ తమ్ముళ్ళు ఓకె అంటున్నారంటే ఆ పార్టీ పరిస్థితి ఎంతలా ఉందో అర్ధం చేసుకోవాల్సిందే. చాలా మంది వైసీపీ టికెట్ మీద పోటీ చేసి అయినా అధికార పక్షంలో ఉంటామని తెగేసి చెబుతున్నారట.


మరి దీనికి జగన్ కనుక సరేనంటే ఒకటి రెండూ కాదు. ఏకంగా పది  వరకూ  ఎమ్మెల్యే సీట్లకే ఉప ఎన్నికలు వచ్చేస్తాయి. అందులో  సీనియర్లు, ఏపీలో పేరు పడిన నాయకులు కూడా ఉంటారట. ఈ సీట్లలో పోటీ పెడితే ఉప ఎన్నికల్లో మొత్తానికి మొత్తం వైసీపీ గెలుచుకుంటుందన్న అంచనాలు ఇప్పటికి బలంగా ఉన్నాయి. ఇది ఓ విధంగా మంచి సంప్రదాయమే కూడా పార్టీకి రాజీనామా చేసి వచ్చి పోటీ చేయడం. అయీతే దీనికి ధన  వ్యయం పెద్ద ఎత్తున ఖర్చు అవుతుంది. అది ఎవరు భరిస్తారు. చూడాలి. మరి.


మరింత సమాచారం తెలుసుకోండి: