పివి నరసింహారావు ప్రధాన మంత్రిగా పదవీబాధ్యతలు చేపట్టిన తరువాత మన్మోహన్ ను ఏరికోరి ఆర్థికశాఖ మంత్రిగా నియమించుకున్నాడు.  ఈ పదవికి అయన వన్నె తీసుకొచ్చిన సంగతి తెలిసిందే.  ఆర్ధిక శాఖామంత్రిగా ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చారు.  దేశం ఆర్ధికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న సమయంలో సంస్కరణలు ప్రవేశపెట్టి దేశాన్ని సమర్ధవంతంగా ముందుకు నడిపించాడు.  
2004 నుంచి 2014 వ సంవత్సరం వరకు మన్మోహన్ సింగ్ దేశానికీ ప్రధానిగా పనిచేశారు.  2008 లో ప్రపంచ దేశాలు ఆర్ధిక మద్యంతో ఇబ్బందులు ఎదుర్కొంటుంటే.. భారత్ మాత్రం ఆ ఇబ్బందులనుంచి ఈజీగా బయటపడింది.  ఇంకా చెప్పాలంటే అసలు దాని ప్రభావం దేశంలో కనిపించలేదు.  దీనికి కారణం మన్మోహన్ తీసుకున్న నిర్ణయాలే అని చెప్పక తప్పదు.  
మన్మోహన్ సింగ్ ప్రత్యక్షరాజకీయాల్లోకి వచ్చినప్పటి నుంచి అసోం నుంచి రాజ్యసభకు ఎంపికవుతూ వస్తున్నారు.  నిన్న శుక్రవారంతో అయన పదవికాలం ముగిసింది.  అసోం నుంచి ఇప్పుడు ఎన్నిక కావడం కష్టం.  అక్కడ ఆ పార్టీ బలం 25 మాత్రమే.  ఉత్తరాది రాష్ట్రాలైన గుజరాత్, రాజస్థాన్, పంజాబ్, మధ్యప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీకి బలం ఉంది.  అక్కడి నుంచి పోటీ చేయించాలంటే.. ఖాళీ లేదు.  దక్షిణాది నుంచి పోటీ   చేయించాలన్న అదే పరిస్థితి నెలకొంది.  
దీంతో ఇప్పుడు మన్మోహన్ సింగ్ దారెటు అనేది సమస్యగా మారింది.  కాంగ్రెస్ పార్టీకి బలం ఉన్న రాష్ట్రాల్లో ఎవరి చేతనైన బలవంతముగా రాజీనామా చేయించి.. ఆ ప్లేస్ లో మన్మోహన్ సింగ్ ను రాజ్యసభకు పంపుతారా లేదంటే.. పార్టీ అంతర్గత వ్యవహారాలకే పరిమితం అవుతారా చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: