అడవిని నమ్ముకొని బతుకుతున్న గిరిజనులు జనజీవన స్రవంతిలోకి రావడానికి అస్సలు ఇష్ట పడరు. తెలంగాణ అడవీ ప్రాంతంలో మహారాష్ట్ర, ఛత్తీస్‌ఘడ్‌ నుండి గత 3 దశాబ్దాలుగా వేలాది గిరిజనులు వలస వచ్చి బతుకుతున్నారు.
వారు మారుమూల అడవుల్లో ఉండటం వల్ల వారికి కనీస సౌకర్యాలు అందించ లేక పోతున్నామని ప్రభుత్వ అధికారులు అంటున్నారు.
 ఇదిలా  ఉంటే అసలు వారు ఎందుకు  అడవిని వీడటం లేదు అనే విషయంలో ఒక రహస్యం వెల్లడైంది. 
కుమ్రం భీం జిల్లా కాగజ్‌నగర్‌ మండలం కోమలగొండి గ్రామం గిరజనులు సమీపంలోని గొందిగూడెంలో జమునాబాయి అమ్మవారి ఆలయం ఉందని పలువురు ఆదివాసీలు అంటున్నారు.

 '' తాము యాభై ఏళ్లుగా గూడెంలో ఉండటానికి కారణం గొందిగూడెంలో జమునాబాయి దేవత కొలువై ఉంది, ఆమె మాకు ఇలవేల్పు .
మైదాన ప్రాంతంలో ఉండటం కంటే.. తాము దేవత కొలువై ఉన్న ప్రాంతాల్లోనే ఉంటామని.. '' కె.కృష్ణ  అనే ఆదివాసీ అన్నాడు . 


మరింత సమాచారం తెలుసుకోండి: