ఏపీలో తెలుగుదేశం పార్టీ తరపున గెలిచిన కొద్ది మంది ఎమ్మెల్యేల్లో ఎవరు ఎప్పుడు పార్టీకి షాక్ ఇస్తారో ?కూడా తెలియని పరిస్థితి. పార్టీ అధినేత చంద్రబాబు ఇప్పటికైనా మారతారని నమ్మకం లేని నేతలంతా త‌లో దారి చూసుకునేందుకు రెడీ అవుతున్నారు. టిడిపి సీనియర్ నేతలతో పాటు పార్టీ నుంచి గెలిచిన వారిలో కొందరు వైసీపీలో ఇప్పటికిప్పుడు చేరేందుకు రెడీగా ఉన్నారు. అయితే వైసిపికి ఏకంగా 150 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. జగన్ ముందు నుంచి ఫిరాయింపుల చట్టానికి తాను తూట్లు పొడవాలని, తమ పార్టీలోకి రావాలనుకునే వారివిషయంలో కొన్ని కండిషన్లు ఉన్నాయని చెబుతూ వస్తున్నారు. 


తెలుగుదేశం పార్టీ నుంచి వైసీపీలోకి వచ్చే నేతలు వారి గుణగణాలను తెలుసుకుని తాము తమ పార్టీలో చేర్చుకోవాలని లేదా ? అన్న విషయపై చెబుతామని చెప్పినట్టు ఆ పార్టీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి చెప్పిన సంగతి తెలిసిందే. టిడిపి నుంచి గెలిచిన ఎమ్మెల్యేలు వైసీపీలోకి వెళ్ళాలంటే ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేయాలన్న‌దే జగన్ ప్రధాన కండిషన్. ఇదిలా ఉంటే వైసీపీలోకి వెళ్ళలేని వారు బిజెపిలో చేరేందుకు సిద్ధమైపోతున్నారు. ఈ లిస్టులో మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. గంటా తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసి త్వరలోనే భారతీయ జనతా పార్టీలో చేరే ఆలోచనలో ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి. 


ఇప్పుడున్న పరిస్థితుల్లో చాలా మంది వైసీపీలోకి వెళ్లేందుకు రెడీగా ఉన్నా మళ్లీ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ఉప ఎన్నికలకు వెళ్లి గెలవడం అంటే మామూలు విషయం కాదు. అందులోనూ అది చాలా ఖర్చుతో కూడుకున్నది. అందుకే ఇలాంటి నేతలంతా ఇప్పుడు బీజేపీ వైపు చూస్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఏపీలో వచ్చే ఎన్నికల నాటికి బలోపేతం కావాలని గ్రౌండ్ వర్క్ స్టార్ట్ చేసిన కమలం నేతలు టిడిపిలోని కొందరు సీనియర్లుపై కన్నేశారు. అలాగే టిడిపి నుంచి ఎవరు తమ పార్టీలోకి వచ్చినా చేర్చుకునేందుకు కూడా రెడీగా ఉన్నారు. 


ఈ క్రమంలోనే గంటా కమలం కీలక నేతలతో చర్చలు జరిపినట్టు తెలుస్తోంది. ఈ ఎన్నికల్లో గంట విశాఖ ఉత్తర నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఆఖ‌రిలో విజయం సాధించిన సంగతి తెలిసిందే. తాను ఎమ్మెల్యేగా గెలిచి అందుకే చావు తప్పి కన్ను లొట్టపోయిన చందంగా గెలిచిన గంటా ఎప్పుడు అధికారం ఎటువైపు ఉంటే అటువైపు ఉంటారన్నది ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ క్రమంలోనే ఇప్పుడు వైసీపీలోకి వెళ్ళిన ఆయనకు అక్కడ ప్రయార్టీ ఛాన్స్ లేదు. అందుకే ఆయన బిజెపి వైపు చూస్తున్నట్లు తెలుస్తోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: