కుమ్రం భీం జిల్లా కాగజ్‌నగర్‌ మండలం కోమలగొండి గ్రామం, బాధిత ఆదివాసీలను 24 గంటల్లో తమ ముందు హాజరుపర్చాలని హైకోర్టు ధర్మాసనం ఇచ్చిన ఆదేశాలతో.. ఆదివారం (16.6.2019) అటవీ శాఖ అధికారులు రెండు ఏసీ బస్సుల్లో గిరిజన కుటుంబాలను తీసుకొచ్చారు. 

రాత్రి భోజనాలు పెట్టించి, తిరిగి కాగజ్‌నగర్‌కు పంపారు. ఇలా తరలించిన వారిలో 7 నెలల గర్భిణి ఒకరు ఉండగా.. ఐదుగురు మహిళలు చంటిపిల్లలతో తీసుకొచ్చారు.

 '' ఏడు నెలల గర్భిణితో ఒకేరోజు 600 కిలోమీటర్లు ప్రయాణం చేయించడం దారుణమని..'' తెలంగాణ రచయితల వేదిక అధ్యక్షుడు ఆచార్య జయధీర్‌ తిరుమలరావు ఆవేదన వ్యక్తం చేశారు.
 ఆదివారం ఆయన , ప్రొఫెసర్‌ గూడురు మనోజతో , కలిసి ఆదివాసీలకు, తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తికి మధ్య అనువాదకుడిగా వ్యవహరించారు


మరింత సమాచారం తెలుసుకోండి: