ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత  టిడిపి నేతలను టార్గెట్ చేస్తున్నారన్న వార్తలు వస్తున్నాయి.  ప్రత్యేకించి స్పీకర్ కోడెల శివప్రసాద్ కుటుంబంపై వైసీపీ కక్ష కట్టిందని టిడిపి నేతలు ఆరోపిస్తున్నారు.

 

ప్రభుత్వం మారిన కొద్ది రోజుల్లోనే మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు పై,  ఆయన కుటుంబంపై వరుసగా కేసులు నమోదవుతున్నాయి.  ఈ నమోదవుతున్న కేసుల్లో ఒకదానికి మరొకదానికి పొంతన ఉండటం లేదు.  రియల్ ఎస్టేట్ దందాలు, అక్రమ వసూళ్లు,  ఉద్యోగాల పేరుతో మోసం.. ఇలా  పలు కేసులు ఇప్పటికే నమోదయ్యాయి.

 

కోడెల శివప్రసాదరావు అక్రమాలపై తెలుగుదేశం పార్టీలోనూ జరుగుతోంది.  కోడెల కుటుంబం  అక్రమాల వల్లే గుంటూరు జిల్లాలో పార్టీకి నష్టం జరిగిందని  దివ్యవాణి ఆరోపించారు కూడా.  ఈ నేపథ్యంలో తన కుటుంబం పై వస్తున్న ఆరోపణలపై మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు స్పందించారు. 

 

 

 ఈ కేసులన్నీ ఓ పథకం ప్రకారం  పెడుతున్నవే అని  కోడెల అంటున్నారు. తనపై కేసు వ్యవహారం  వెనుక  వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి  హస్తం ఉందని కోడెల శివప్రసాదరావు ఆరోపించారు.  తనపై, తన కుటుంబంపై  నమోదైన కేసుల విషయంలో  విచారణకు సిద్ధమని ఆయన ప్రకటించారు.  నిజానిజాలన్నీ విచారణలో వెలుగు చూస్తాయని  మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు ఆశాభావం వ్యక్తం చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: