వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ  రాజమహేంద్రవరం పార్లమెంట్‌ నియోజకవర్గ స‌భ్యుడు, చీఫ్‌ విప్‌గా మార్గాని భరత్‌రామ్ నియ‌మితులు అయిన సంగ‌తి తెలిసిందే. రాజమహేంద్రవరం పార్లమెంటు సీటును బీసీ సామాజిక వర్గానికి కేటాయించడంతోపాటు, వైసీపీ అధినేత‌ జగన్‌మెహన్‌ రెడ్డి ప్రకటించిన బీసీ డిక్లరేషన్‌తో బీసీలంతా వైఎస్సార్‌సీపీకి వెన్నుదన్నుగా నిలిచి ఓట్లు వేసి గెలిపించారు. రాష్ట్రంలో ఎంతోమంది సీనియర్లుండగా బీసీలకు పెద్దపీట వేయాలని, యువతకు ప్రాధాన్యతనీయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌ రెడ్డి చీఫ్‌విప్‌గా అవకాశం కల్పించారు. తాజాగా ఢిల్లీలో ఆయ‌న ప్ర‌మాణ స్వీకారం చేశారు. అయితే, ఈయ‌న గురించి తెలిసిన వ్య‌క్తి ఒక‌రు ఆస‌క్తిక‌ర రీతిలో భ‌ర‌త్ గురించి ఆస‌క్తిక‌ర పోస్ట్ ఫేస్‌బుక్‌లో పొందుప‌ర్చారు. 

 

మా ఎంపీ ఆధ్యాత్మిక చింత‌న‌ప‌రుడు అని చెప్పుకోవ‌డం అని ప్ర‌క‌టించ‌డం త‌మ‌కెంతో గ‌ర్వ‌కార‌ణంగా ఉంద‌ని పేర్కొంటూ దీక్షితుల సుబ్ర‌హ్మ‌ణ్యం అనే వ్య‌క్తి ఆస‌క్తిక‌ర పోస్ట్ పెట్టారు. ఈ మేర‌కు భ‌ర‌త్ గుణ‌గ‌ణాల‌ను విశ్లేషిస్తూ స‌వివ‌రంగా వెల్ల‌డించారు. శ్రీ సీతారామాంజ‌నేయ అనుగ్ర‌హ ప్రాప్తిర‌స్తు అని ముగించిన ఈ పోస్ట్ సోష‌ల్ మీడియాలో ఆస‌క్తిక‌రంగా మారింది. 

 

కాగా, పార్ల‌మెంటు స‌మావేశాల నేప‌థ్యంలో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ పార్లమెంటరీ పార్టీ నేతగా రాజ్యసభ సభ్యుడు వేణుంబాక విజయసాయిరెడ్డి నియమితులయ్యారు. లోక్‌సభలో వైఎస్సార్‌సీపీ పక్ష నేతగా పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి, పార్టీ చీఫ్‌ విప్‌గా మార్గాని భరత్‌రామ్‌ ఎంపికయ్యారు. త‌నపైన చాలా పెద్ద బాధ్యత  పెట్టారని,  ఆయన నమ్మకాన్ని వమ్ముచేయకుండా పార్లమెంటులో తెలుగువాణిని వినిపిస్తానని మార్గాని భరత్‌రామ్‌ అన్నారు. సీఎం వైఎస్ జగన్ నాయకత్వం ఎందరికో ఆదర్శమ‌ని మార్గాని భ‌ర‌త్ వెల్ల‌డించారు. పాదయాత్ర సందర్భంగా వైసిపిలోకి ప్రముఖ బీసీ నేత, భ‌ర‌త్ తండ్రి మార్గాని నాగేశ్వరరావు చేరారు. మార్గాని తూర్పుగోదావరి జిల్లాలోని బీసీస‌ నేతల్లో ప్రముఖులుగా ప్రచారంలో ఉంది. గౌడ సామాజికవర్గానికి చెందిన మార్గాని వైసీపీలో చేరారు.

మరింత సమాచారం తెలుసుకోండి: