అవును చంద్రబాబునాయుడులో ఉలికిపాటు ఎక్కువైపోతోంది. మొన్న ఢిల్లీ పర్యటనలో జగన్మోహన్ రెడ్డి-అమిత్ షా సమావేశం కావచ్చు తాజాగా జగన్-కెసియార్ భేటీ కావచ్చు. జగన్ ఎవరితో భేటీ అయినా చంద్రబాబులో టెన్షన్ పెరిగిపోతోంది. పాపం తన గుట్టు కెసియార్, మోడి తాజాగా జగన్ చేతిలో ఇరుక్కున్న విషయం బాగా తెలుసు.

 

ఓటుకునోటు కేసులో ఇరుక్కోవటంతో కెసియార చేతిలో అడ్డంగా బుక్కైపోయారు. ఈ కేసు విచారణ ఎప్పుడూ స్పీడయినా చంద్రబాబు పీకల్లోతు ఇరుక్కోవటం ఖాయం. గట్టిగా చెప్పాలంటే ఓటుకునోటు కేసు చంద్రబాబు  మెడమీద కత్తి లాంటిదనే చెప్పాలి.

 

ఇక ఐదేళ్ళల్లో చంద్రబాబు హయాంలో జరిగిన అవినీతి అంతా ఇంతా అని చెప్పేందుకు లేదు. ఏ ప్రాజెక్టు చూసినా భారీ అవినీతే. ఇందులో కేంద్రప్రభుత్వ ప్రాజెక్టులు కూడా బోలెడన్ని ఉన్నాయి. పోలవరం, పట్టిసీమ, ఇరిగేషన్ ప్రాజెక్టులే కాకుండా నీరు-చెట్టు, వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణం పథకంలో జరిగిన అవినీతి కంపుకు అంతే లేదు.

 

జగన్ గనుక ఏ పథకం అవినీతి విషయంలో అయినా విచారణ జరిపించమని కేంద్రానికి లేఖ రాస్తే చాలు చంద్రబాబు అడ్డంగా బుక్కైపోయినట్లే. సరే ప్రాజెక్టులు, పథకాల్లో జరిగిన అవినీతిని పక్కనపెట్టేద్దాం. విశాఖపట్నం విమానాశ్రయంలో జగన్ పై జరిగిన హత్యాయత్నం కేసు ఒక్కటి చాలు. హత్యాయత్నానికి పాల్పడిన శ్రీనివాస్ వెనుక ఎవరున్నారన్న విషయం బయటకు వస్తే చాలు అంతే సంగతులు.

 

అందుకే మోడి, కెసియార్, అమిత్ షాల్లో జగన్ ఎవరిని కలిసినా చంద్రబాబు ఉలిక్కిపడుతున్నారు. తనపై ఉన్న కేసుల్లో ఎప్పుడు ఏ కేసును తవ్వి బయటకు తీస్తారో అన్న భయంతోనే దినదినగండంగా బతుకుతున్నారు చంద్రబాబు. చంద్రబాబు టెన్షన్ ఒకటైతే పుత్రరత్నం నారా లోకేష్ శాఖల్లో జరిగిన అవినీతి బయటపడితే వారసుడి కష్టాలేంటో అర్ధం కాకుండా ఉంది. అందుకనే ప్రతిరోజు చంద్రబాబులో ఉలికిపాటు పెరిగిపోతోంది.

 


మరింత సమాచారం తెలుసుకోండి: