జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం రాజకీయాలకు దూరంగా తన సినిమాలు తానూ చూసుకుంటూ దూసుకుపోతున్నారు. అయితే ఏపీకి ఆదాయాన్ని అందించే ఏ అవకాశాన్నీ వదులుకోరాదని సీఎం జగన్ భావిస్తున్నారు. ప్రస్తుతం తన కేబినెట్‌లో ఉన్న మంత్రులందరికీ కూడా ఇదే విషయాన్ని చెప్పారు. దీంతో వ్యవసాయ, పారిశ్రామిక, పర్యాటకం సహా రాష్ట్రంలోని అన్ని రంగాలకు అంబాసీడర్‌లను నియమించాలని ముఖ్యమంత్రికి కొందరు సలహా ఇచ్చారని తెలుస్తోంది.


ఇందులో భాగంగానే ఏదైనా ఒక దానికి జూనియర్ ఎన్టీఆర్‌ను నియమించాలని కూడా పలువురు సూచించారని సమాచారం. ఈ మేరకు ఏపీ సీఎం తర్జనభర్జన పడుతున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే, అతడిని సంప్రదించడం ఎలా..? ఒకవేళ అడిగినా తారక్ ఒప్పుకుంటాడా..? అన్న దానిపైనా పార్టీ అంతర్గత సమావేశంలో చర్చ జరిగినట్లు విశ్వసనీయంగా తెలుస్తోంది. వాస్తవానికి ఏపీలో టీడీపీ అధికారంలో ఉన్న సమయంలోనే ప్రభుత్వానికి ఎటువంటి సహకారం అందించని తారక్.. దానిని ఓడించి వచ్చిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి మద్దతు ప్రకటిస్తారా అంటే అనుమానమే.


అయితే, అధికార పార్టీలోని మంత్రి కొడాలి నాని, తారక్ మామ నార్నే శ్రీనివాస్ ఒత్తిడి తెస్తే చిన్న రాముడు ఒప్పుకునే అవకాశాలూ లేకపోలేదు అన్న వాదనలు వినిపిస్తున్నాయి. తన తాత పెట్టిన పార్టీని అధికారంలోకి తీసుకు రావాలన్న ఉద్దేశ్యంతో 2009 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరపున జూనియర్ ఎన్టీఆర్ ప్రచారం చేశారు. ఉమ్మడి రాష్ట్రంలో ఖాకీ వస్త్రాలు ధరించి, చైతన్య రథంపై నలుమూలలా తిరుగుతూ తన తాత నందమూరి తారక రామారావును గుర్తు చేశాడు. జూనియర్ ప్రచారానికి భారీ స్పందన కూడా వచ్చింది. కానీ, అప్పుడు ప్రతికూల ఫలితాలు వచ్చాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: