వీళ్లు మామికాయలు తెంపరు..ఎందుకో తెలుసా..? 
ఈ రైతుకు రెండెకరాల్లో ఇలా మామిడితోట విస్తరించి ఉంది. చెట్లనిండా కాయలు పక్వానికి వచ్చాయి. కాయలు కోసుకొని మార్కెట్‌కి తరలిస్తాం ఎంత కావాలో చెప్పు అని రోజూ ఎవరో ఒకరు వచ్చి అడుగుతున్నారు. కానీ ఈ రైతు నవ్వుతూ కింద రాలిపడిన కాయలు ఏరుకుంటున్నాడు. తప్ప, చెట్ల నుండి తెంప డానికి ఒప్పుకోవడం లేదు. ఈ రైతే కాదు,

జయశంకర్‌ జిల్లా, గోవిందరావు పేట మండల్‌ , జంపన్న వాగు పక్కనే జీవిస్తున్నఅనేక మంది గిరిజనులు తమ తోటల్లో మామిడి , ఉసిరి కాయలు కోయడానికి ఇష్టపడరు.
ఇటీవల మేం ఆ ప్రాంతం వెళ్లినపుడు చెట్ల కింద రాలిపడిన పండ్లు మాకిచ్చారు.

తొక్కను కూడా వదలకుండా తినాలనిపించిన రుచిగా ఉన్నాయి. '' ఇంత మంచి పండ్ల పండిస్తున్న మీరు మార్కెట్‌ చేసుకోవచ్చుకదా, గాలివానొస్తే పంట నష్టం కదా, సీజన్‌ అయిపోతోంది, కాయలు కోసి అమ్ముకుంటే, చక్కని ఆదాయం వస్తుంది, ఈ పండ్లకు ఎంతో డిమాండ్‌ ఉంటుంది...'' అని మార్కెట్‌ భాషలో చెప్పాం. 

'' నిజమే కానీ, చెట్లమీద కాయలు కోయడం మా గిరిజన సంప్రదాయం కాదు, మా కులదేవత ఆగ్రహిస్తుంది. రాలి పడినపుడే తింటాం. అవసరమైతే వాటినే ఎవరైనా కొనుక్కో వచ్చు.
చెట్ల మీద కాయలన్నీ కోసేస్తే , మరి పక్షలు, కోతులు ఆహారం ఉండదు కదా...!! '' అని మాకు జ్ఞానోదయం కలిగించారు. 

అసలైన జీవవైవిధ్యం ఎలా ఉంటుందో గిరిజనులను చూసి సభ్యసమాజం నేర్చుకోవాలి! ( pic by shyammohan)


మరింత సమాచారం తెలుసుకోండి: