జగన్ తండ్రి రాజశేఖర్ రెడ్డి చనిపోయిన తరువాత కాంగ్రెస్ పార్టీ జగన్ మోహన్ రెడ్డిని తీవ్రంగా అవమానించారు. జగన్ తల్లికి కనీసం సోనియా గాంధీ ఆపాయిట్మెంట్ కూడా ఇవ్వలేదంటే అర్ధం చేసుకోవచ్చు. అయితే సోనియా గాంధీ వద్దన్నా జగన్ తన ఓదార్పు యాత్రను తలపెట్టాలని నిర్ణయించుకొని ముందుకు సాగిపోయిన సంగతీ తెలిసిందే. 


తనను ధిక్కరించినందుకు సోనియా .. జగన్ మీద కేసులు పెట్టించి జైలు పాలు చేసిన సంగతీ తెలిసిందే. అయితే జగన్ వాటినన్నింటిని తట్టుకొని 9 ఏళ్ల సుదీర్ఘ పోరాటం చేసి ఆంధ్ర ప్రదేశ్ కు సీఎం అయిపోయారు. కాంగ్రెస్ పార్టీని ఏపీలో లేకుండా భూస్థాపితం చేసారు జగన్. దీనితో జగన్ సత్తా ఏంటో కాంగ్రెస్ పార్టీకి తెలిసొచ్చింది. చివరికి టీడీపీతో పొత్తు పెట్టుకున్నా , ఆ పార్టీకి ఏపీలో ఘోర పరాజయం తప్పలేదు. 


దీనితో కాంగ్రెస్ పార్టీకి తాము చేసిన తప్పేంటో తెలిసొచ్చింది. జగన్ లాంటి ప్రజాదరణ ఉన్న నాయకుణ్ణి పోగొట్టుకొని కురు వృద్ధులను వెంట పెట్టుకొని ఆ పార్టీ తీవ్రంగా మునిగిపోయింది. అయితే జగన్ ను వదులుకొని చాలా పెద్ద తప్పు చేశామని కాంగ్రెస్ పెద్దల దగ్గర రాహుల్ చెప్పినట్లు సమాచారం. జగన్ తమ పార్టీలో ఉండి ఉంటే, కాంగ్రెస్ పార్టీకి ఈ పరిస్థితి వచ్చేది కాదని రాహుల్ బాధపడ్డారని తెలుస్తుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: