ఎన్నికల ముందు ఎన్నికల తర్వాత రాజకీయ నాయకులు తమ స్వప్రయోజనాల కోసం పార్టీలు మారుతూ నియోజకవర్గ అభవృద్ధి కోసం అంటూ కాకమ్మ కబుర్లు చెబుతుంటారు.ప్రస్తుతం ఏపీలో అధికార పక్షమైన వైసీపీలో ఉన్న నాయకులకే న్యాయం చేయలేక సతమతవుతుంది.ఇంక టీడీపీ పని అయిపోయింది అని వార్తలు వస్తున్న నేపథ్యంలో నాయకులు అధికార పక్షాన్ని ప్రతిపక్షాన్ని పక్కన పెట్టి బీజేపీ లోకి వెళ్తున్నారు.

కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ఏపీలో బలపడేందుకు ఇతర పార్టీ లో ఉన్న సీనియర్లను మరియు ఓటమి చెందిన నాయకులతో తమ పార్టీలో చేరాల్సిందిగా సంప్రదింపులు జరుపుతుంది.కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ అవ్వడంతో మరియు ప్రస్తుతం రాష్ట్రంలో ప్రతిపక్షం బలహీనంగా ఉండటంతో వారితో చేరితే రాష్ట్రంలో అధికారాన్ని అందుకోవచ్చని సీనియర్స్ అటే మొగ్గు చూపుతున్నారు.

జనసేన తమ తో ఉండాలి అనుకున్న వాళ్ళు ఉండచ్చు అని తాము ఎవరిని కాపాడుకోవాల్సిన పని లేదని తమ వైఖరిని తేల్చి చెప్పేసింది.ఇక టీడీపీ మాత్రం తమ నాయకులను బిజెపిలోకి పోనివ్వకుండా కాపలకాయాల్సి వస్తుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: