గత సార్వత్రిక ఎన్నికలకు ముందు తన మిత్రపక్షమైన బిజేపితో దాని నాయకులు మోడీ - షా లతో నిష్కారణంగా శత్రుత్వం పెంచుకొని వారి రాజకీయ పతనానికి దేశవ్యాప్త ప్రతిపక్షాలతో ఐఖ్యత సాధించి దాదాపు అసాధారణ పదజాలంతో ప్రధానిని వ్యక్తిగతంగా దూషించిన  చంద్రబాబు తీరెవరూ జాతియావత్తూ మరచిపోలేదు మరచిపోదు. దీనికి తోడు సాదినేని యామిని, దివ్యవాణి, గరుడ సొంటినేని శివాజి, చలసాని శ్రీనివాస్ లాంటి అమాంబాపతు వ్యక్తులతో ప్రధానిని బిజేపి అధ్యక్షుణ్ణి తిట్టించటం జరిగింది. అవకాశం దొరకగానే వాళ్ళు వీళ్ళంతు చూసే క్రమంలో పని చేస్తున్నట్లు సమాచారం. అంతేకాదు నాటి తెలుగుదేశం ఎంపీలు, ఎమెల్యేలు, రాజ్యసభసభ్యులు ఈ తిట్ల కార్యక్రమంలో పాల్గొన్నవారే.  


బహుశా ప్రతీకారం తీర్చుకోవటానికే కావచ్చు టిడిపి ఉనికినే సమూలంగా తొలగించటానికి బీజేపి నాయకత్వం ప్రయత్నిస్తూ వుండవచ్చు. అందుకే వారికి గంటా లాంటి రాజకీయ అవకాశవాదులకు అవకాశం ఇస్తున్నారని సమాచారం. రాజ్యసభలో సుజానా చౌదరి, లోక్సభలో కేసినేని నాని, ఏపి శాసనసభలో గంటా శ్రీనివాసరావు వీళ్ళ ద్వారా తెలుగుదేశం నిర్మూలన కార్య క్రమం మొదలెట్టారేమో? 


నలుగురు రాజ్యసభ ఎంపీలు టీడీపీకి గుడ్-బై కొట్టి ఇంకా 24గంటలు కూడా కాలేదు. తెలుగుదేశం పార్టీకి మరో గట్టి ఎదురుదెబ్బ తగలనుంది. ఈసారి మాజీమంత్రి గంటా శ్రీనివాసరావు తెదేపాకి భారీ షాక్ ఇవ్వనున్నట్లు సమాచారం. మాజీ మంత్రి  ప్రస్తుత విశాఖ ఉత్తర శాసనసభ్యుడు గంటా శ్రీనివాసరావు, మరో 15 మంది ఎమ్మెల్యేలతో కలసి టీడీపీకి వీడ్కోలు చెప్పనున్నట్లు అత్యంత విశ్వసనీయంగా తెలిసింది.


ప్రస్తుతం ఆ ఎమ్మెల్యేలతో కలసి గంటా శ్రీనివాసరావు శ్రీలంకలోని కొలంబోలో ఉన్నారని, వారంతా కొలంబో నుంచి నేరుగా ఢిల్లీ వెళ్లి బీజేపీ కండువా కప్పుకోనున్నట్టు తెలిసింది. ఇప్పుడు ఆ 15 మంది ఎమ్మెల్యేలు ఎవరు అనేది సస్పెన్స్‌గా మారింది.


ఆంధ్రప్రదేశ్‌లో ఈ ఏడాది ఏప్రిల్‌ 11 న జరిగిన అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో టీడీపీ ఘోర పరాజయం పాలైంది. టీడీపీ నుంచి కేవలం 23మంది ఎమ్మెల్యేలు, ముగ్గురు ఎంపీలు గెలిచారు. అయితే, ఆ 23మందిలో ఇప్పుడు గంటాతో కలిసి 16మంది ఒకవేళ జంప్ అయితే, ఏపీలో టీడీపీకి ప్రతిపక్ష హోదా కూడా గల్లంతయ్యే ప్రమాదం ఉంది. చంద్రబాబుకి ప్రతిపక్ష నాయకుడి హోదా కూడా పోతుంది.


ఇప్పటికే నలుగురు రాజ్యసభ ఎంపీలు సీఎం రమేష్, సుజనా చౌదరి, గరికపాటి రామ్మోహనరావు, టీజీ వెంకటేష్ కమలం కండువాలు కప్పుకొన్నారు. చంద్రబాబు నాయుడు విదేశీ పర్యటన నుంచి వచ్చేసరికి టీడీపీ ఎమ్మెల్యేల్లో మూడొంతుల మంది బీజేపీ లో చేరతారంటూ ఆ పార్టీ నేత విష్ణువర్ధనరెడ్డి చెప్పారు. గంటా బృందంను దృష్టిలో పెట్టుకునే ఆయన ఈ వ్యాఖ్యలు చేసి ఉండవచ్చని అంటున్నారు.


గంటా శ్రీనివాసరావు పార్టీ మారతారంటూ ఎన్నికలకు ముందునుంచే ప్రచారం జరిగింది. అయితే, అవన్నీ తప్పుడు ప్రచారా లు అంటూ లోకేష్‌ నారా ఒక సెల్ఫీ పోస్ట్ చేశారు. ఎన్నికల తర్వాత నుంచి గంటా శ్రీనివాసరావు మౌనంగానే ఉన్నారు. పెద్దగా ఎక్కడా వార్తల్లో కనిపించలేదు.


గతంలో టీడీపీ నుంచి పీఆర్పీలోకి వెళ్లిన గంటా శ్రీనివాసరావు మళ్ళి అక్కణ్ణుంచి ఆ పార్టీని కాంగ్రెస్‌ లో విలీనం చేసినప్పుడు మంత్రి అయ్యారు. ఆ తర్వాత మళ్లీ టీడీపీ లో చేరి భీమిలి నుంచి గెలుపొందారు. చంద్రబాబు కేబినెట్‌లో మంత్రిగా పని చేశారు. ఇక ఈపుడు టిడిపిలో నుంచి ఒక పదిహేనుమంది శాసన సభ్యులతో బీజేపీలోకి చేరటం ఇక లాంచనమే అనేది సమాచారం.


మరింత సమాచారం తెలుసుకోండి: