బొత్స స‌త్య‌నారాయ‌ణ‌. చీపురుప‌ల్లి ఎమ్మెల్యేగా తాజా ఎన్నిక‌ల్లో విజ‌యం సాధించిన ఆయ‌న వైసీపీ అధినేత జ‌గ‌న్ కేబినె ట్‌లో మంత్రి ప‌ద‌విని సాధించారు. వైఎస్ హ‌యాంలో తొలిసారి మంత్రి అయిన బొత్సాకు వైఎస్ కుటుంబంతో మంచి సాన్నిహిత్యం ఉండ‌డం విశేషం. త‌ర్వాత కాంగ్రెస్‌లోనూ కీల‌క ప‌ద‌వులు నిర్వ‌హించారు. అయితే, తాజాగా ఆయ‌న రెండు కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. అది కూడా చంద్ర‌బాబును ఉద్దేశించి చేసిన వ్యాఖ్య‌లు రాజ‌కీయ వ‌ర్గాల్లో సంచ‌ల‌నం రేపుతు న్నాయి. 


కొంద‌రు బొత్స వ్యాఖ్య‌ల ఆంత‌ర్యాన్ని గ్ర‌హించ‌లేక పోయినా.. మ‌రికొంద‌రు మాత్రం బొత్స వ్యాఖ్య‌ల వెనుక విష యాన్ని గ్ర‌హించి.. ``అమ్మో``అంటున్నారు. స‌రే! విష‌యంలోకి వెళ్తే.. గుంటూరు జిల్లా కృష్ణాన‌దీ తీరంలోని ఉండ‌వ‌ల్లిలో మాజీ సీఎం చంద్ర‌బాబు హ‌యాంలో నిర్మిం చిన ప్ర‌జావేదిక రాజ‌కీయ వేదిక‌కు కార‌ణ‌మైంది. దీనిని త‌న‌కు ఇవ్వాల‌ని కోర‌డం, ప్ర‌భుత్వం నుంచి ఎలాంటి స‌మాధా న‌మూ లేక పోవ‌డం, ఈలోగా చంద్ర‌బాబు విదేశాల‌కు విహార యాత్ర‌కు వెళ్ల‌డం ఈ నేప‌థ్యంలో ఉరుములు లేని పిడుగు మాదిరిగా ప్ర‌భుత్వం దీనిని స్వాధీనం చేసుకునేందుకు రెడీకావ‌డంతో రాష్ట్రంలో రాజ‌కీయం ఒక్క‌సారిగా వేడెక్కింది. 


ఈ క్ర‌మంలో ప్ర‌జావేదిక వ‌ద్ద‌కు వ‌చ్చిన బొత్సా.. చంద్ర‌బాబుపై ఫైరయ్యారు. ‘ప్రజావేదిక విషయంలో టీడీపీ నేతల రాజకీయం, రాద్ధాంతం ఏమిటి? టీడీపీ నిధులతో కానీ, చంద్రబాబు సొంత డబ్బుతో కానీ కట్టించారా? లేక ఆయన తండ్రి, తాత కట్టిన భవనాలా ఇవీ?’’ అని బొత్స ఫైర‌య్యారు. ఇంత‌టితో ఆగ‌ని బొత్సా..  విపక్ష నేతకు గత ప్రభుత్వం ఎలాంటి గౌరవం ఇచ్చిందో మేమూ అలాంటి గౌరవమే ఇస్తాం- అని వ్యాఖ్యానించారు. ఈ ఒక్క వ్యాఖ్యే ఇప్పుడు రాజ‌కీయంగా చ‌ర్చ‌కు కార‌ణ‌మైంది. రాబోయేరోజుల్లో చంద్ర‌బాబు ఇంకెన్ని స‌మ‌స్య‌లు ఎదుర్కొనాలో.. ప్ర‌బుత్వం ఇంకెంత‌గా ఆయ‌న‌ను ఇరుకున పెడుతుందో బొత్స చేసిన ఈ వ్యాఖ్య‌లు స్ప‌ష్టం చేస్తున్నాయి. 


గ‌తంలో ప్ర‌తిప‌క్ష నేతగా ఉన్న జ‌గ‌న్‌ను అనేక రూపాల్లో చంద్ర‌బాబు చెడుగుడు ఆడుకున్నారు. వ్యంగ్యాస్త్రాలు సంధించారు. అసెంబ్లీలో మాట్లాడ‌నివ్వ‌లేదు. ఇవ‌న్నీ క‌లిపి.. తాము కూడా క‌సి తీర్చుకుంటామ‌ని, గ‌తంలో విప‌క్ష నేత‌కు చంద్ర‌బాబు `ఎలాంటి గౌర‌వం` ఇచ్చారో.. ఇప్పుడు తాము కూడా `అలాంటి గౌర‌వం`ఇస్తామ‌ని వ్యాఖ్యానించ‌డం చాలా విష‌యాల‌నే స్ప‌ష్టం చేస్తోంది. అంటే బాబుకు రిట‌ర్న్ గౌర‌వం లాంటిద‌న్న‌మాట‌. మ‌రి ఫ్యూచ‌ర్‌లో ఏం జ‌రుగుతుందో చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: